పుష్య మాసం పంచమి సోమవారం
1896 జనవరి 18న –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది
1927జనవరి 18న భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది
బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు.”మానవసేవ” పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త నాళం కృష్ణారావు జయంతి
సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం పొందిన, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత సుందరం బాలచందర్ జయంతి
తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి
హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి హరి వంశ రాయ్ బచ్చన్ వర్ధంతి
భారత్‌లో గత 24 గంటల్లో 15,144 కొత్త కరోనా కేసులు,181 మంది మృతి
24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,28,938 పాజిటివ్ కేసులు,12,789 మంది మృతి
రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ ప్రకటించారు. రెండో రోజున దేశవ్యాప్తంగా 553 కేంద్రాల్లో 17,072 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు
దేశ రాజధాని ఢిల్లీని కప్పేసిన పొగమంచు… తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు
మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం, ప్రయాణికులను దించేసిన అధికారులు
తమ డిమాండ్ల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులను తొలగించాలని భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి కోరింది
మొదట కోవిడ్ యోధులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ముగిసిన వెంటనే, 50 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే సమయంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ నాయుకులు టీకా తీసుకుంటారని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ వెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లోని జలూర్ జిల్లాలో దారుణం, బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మృతి.. 17 మందికి గాయాలు
అర్థరాత్రి వేళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సర్‌ప్రైజ్ చెక్స్, ప్రత్యేక నిఘా పెట్టిన చంద్రాయణగుట్ట పోలీసులు
తిరుపతిలో రెండో రోజు కూడా ఎదురుచూపులే.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాని ఫ్రంట్ లైన్ వారియర్స్
జమ్మూ శ్రీనగర్ హైవే రాంబన్ వద్ద కూలిన వంతెన, కేవలం 60 గంటల్లోనే నిర్మించిన సైన్యం
రైతుల ఆందోళన, పంజాబీ నటుడితో సహా 40 మందికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, అకాలీదళ్ మండిపాటు
యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు, బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం
ప్రాజెక్టు అంశంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
కర్ణాటక పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజిబిజీ, పలు అభివృద్జి పనులకు శంకుస్థాపన
ఆలయం మనిషికి నైతికశక్తినిచ్చే సాధనం, సమాజ రక్షణకు మార్గం, మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చే నిలయం : చిన్న జీయర్ స్వామి
జీ-7 సమ్మిట్ కి హాజరు కావాలని ప్రధాని మోదీకి బ్రిటన్ పిలుపు,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాను సందర్శించే సూచన
మళ్ళీ కరోనా పుట్టిల్లు చైనాలో పెరుగుతున్న కేసులు, 5 రోజుల్లో 1500పడకల ఆస్పత్రి నిర్మాణం
కోవాగ్జిన్ సేఫ్, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం 42 రోజుల తరువాతే యాంటీ బాడీల డెవలప్ మెంట్, నిపుణుల వెల్లడి
భారత సంతతికి చెందిన అమెరికా ప్రొఫెసర్ ముబారక్ ఉస్సేన్ సయ్యద్ అరుదైన ఘనత సాధించారు. మెదడుపై ఆయన చేస్తున్న ప్రయోగానికి గాను ప్రతిస్ఠాత్మక కెరీర్ ఫెలోషిప్ అవార్డు ఆయనను వరించింది
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు
త్రిపుర కాంగ్రెస్ చీఫ్ బిశ్వాస్ కారుపై దాడి, ఘటనలో స్వల్ప గాయాలు, బీజేపీ కార్యర్తల పనేనని ఆరోపణ
దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ – 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ, తెలుగు రాష్ట్రాల్లో జోరుగా టీకా పంపిణీ
రైతు చట్టాలను చాలామంది అన్నదాతలు సమర్థించారు, పరిష్కారం కనుచూపు మేరలో ఉందని ఆశిస్తున్నా, కేంద్ర మంత్రి తోమర్
అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే మిన్న అని ప్రధాని మోదీ తెలిపారు. దీన్నే ఎక్కువమంది టూరిస్టులు విజిట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ. 100 కోట్లు విరాళాలుగా వచ్చాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. తిరుమల ఆలయం పరిసరాల్లో అడవి పందుల సంచారం, స్పందించిన టీటీడీ అధికారులు.