ఈరోజుల్లో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్… లాంటివి కావాలన్నా రేషన్ తీసుకోవాలన్నా… వేలి ముద్రలు లేకుండా జరగదు. కానీ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ కుటుంబానికి తరతరాలుగా అసలు వేలి ముద్రలే లేవట. ‘పాతకాలంలో అయితే, గుర్తింపు కార్డులుండేవి కాదు కాబట్టి, మా తాతకు వేలి ముద్రలు లేవనే సంగతే మాకు తెలియదు. మా నాన్న గుర్తింపు కార్డు కోసం వెళ్లినప్పుడే తనతో పాటు మా కుటుంబంలోని మగవారెవ్వరికీ వేలి ముద్రలు లేవనే విషయం తెలిసింది’ అంటాడు అపు సార్కర్. ఒక రకమైన జన్యు సమస్య కారణంగా ఇలా జరుగుతుందట. కాకపోతే ప్రస్తుతం అపు కుటుంబం వేలిముద్రలు లేక చాలా తిప్పలు పడుతోంది. డ్రైవింగ్ లైసెన్సు కూడా తీసుకోలేకపోతున్నారు. ఫోన్‌కి సిమ్ తీసుకోవాలన్నా వాళ్ల అమ్మ పేరు మీద తీసుకుంటున్నారట. ఇదో వింత కష్టం అన్నమాట!
వీరికి వేలిముద్రలు ఉండవు
Related tags :