కెనడాలో సంక్రాంతి సంబరాలను తెలుగు అలయన్స్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో అంతర్జాలంలో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులు కల్పనా మోటూరి, సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వాఖ్యాతలుగా వ్యవహరించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం ప్రవాస చిన్నారులు సంక్రాంతి ముగ్గులను ప్రదర్శించారు. భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందంగా ఆలంకిరించిన బొమ్మల కొలువులు వీక్షకులను అలరించాయి. తాకా అధ్యక్షుడు శ్రీనాథ్ కుందూరి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేసి కోవిద్-19 సమయంలో తాకా సేవా కార్యక్రమాలను వివరించారు. తాకా వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతాచారి సామంతపూడి మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావుని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ‘నిత్య జీవితంలో సంక్రాంతి’ గురించి గరికిపాటి చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. ప్రవల్లిక వేమూరి, ఆశ్రిత పొన్నపల్లి, సాహిత, రిధిల పాటలు, నృత్యాలు అలరించాయి. వేడుకల విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామచంద్రరావు, దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లి, ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, మునాఫ్ అబ్దుల్ తదితరులు కృషిచేశారు.
కెనడాలో తాకా సంక్రాంతి సంబరాలు
Related tags :