సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాది కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక బాలబాలికలు, యువతీయువకులతో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలతో రంగవల్లులు, చిన్నారులతో చిత్రలేఖనం పోటీలను నిర్వహించి, కార్యక్రమ వీక్షకులతోనే విజేతలను నిర్ణయించి బహుమతులను అందజేశారు. సింగపూర్ తెలుగు క్యాలెండెర్-2021ను ఆవిష్కరించారు. తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా తమ కార్యవర్గాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థకు సొంత భవనం కలను త్వరలో సాకారం చేసుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహణ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి పుల్లన్న, ప్రసాద్ బచ్చు, సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి
Related tags :