ముఖంపై గుంటలు మీ అందానికి విలన్‌గా మారుతున్నాయా? అయితే, ఈ కింది చిట్కాలను పాటించి చూడండి. తప్పకుండా మంచి ఫలితాలు చూడొచ్చు.
వయస్సు పెరిగేకొద్ది.. చర్మ సమస్యలు పెరుగుతాయి. చర్మం ముడతలు.. గుంతలు లేదా గుంటలు అందానికి విలన్‌గా మారతాయి. ముఖం మీద ఉండే చిన్న రంథ్రాలు క్రమేనా గుంతల్లా మారిపోతాయి. చర్మం మీద ఉండే చిన్న రంథ్రాలు విస్తరించినప్పుడు సేబాషియస్ గ్రంథి ఏర్పడుతుంది. ఇది చర్మాన్ని రక్షించేందుకు నూనెలను విడుదల చేస్తుంది. అయితే, కొంతకాలం తర్వాత ఆ నూనెలే చర్మానికి ప్రతికూలంగా మారతాయి. చిన్న రంథ్రాలను సాగదీస్తాయి. కొన్నాళ్ల తర్వాత అవి పెద్దవిగా మారి అందహీనంగా మరతాయి. అయితే, మీరు మీ చర్మం మీద శ్రద్ధ పెడితే తప్పకుండా తప్పకుండా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా మళ్లీ మీ అందాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు.
❂ దోసకాయ, నిమ్మరసం: ముఖంపై ఉండే రంథ్రాలను దూరం చేయడానికి దోసకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిలికా మీ చర్మానికి యవ్వనాన్ని అందించడమే కాకుండా పెద్ద రంథ్రాలను దగ్గరకు చేస్తాయి. వీటికి నిమ్మరసం చేర్చినట్లయితే మరింత మెరుగైన ఫలితాలను చూడవచ్చు. నిమ్మ కూడా గుంతలను మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
ఇలా చేయండి: రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ నిమ్మరం కలపండి. ఆ రసాన్ని దూది(కాటన్ బాల్స్)తో ముఖానికి అద్దండి. అది బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
❂ అరటి పండు తొక్క: అరటి పండు తొక్కను ఎందుకు పనికిరాదని పడేయకండి. ఇది కూడా ముఖంపై రంథ్రాలను పూడ్చడంలో కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే అరటి పండు తొక్కలో లుటీన్ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ పోషణకు సహకరిస్తాయి. అరటి తొక్కలో ఉండే పొటాషియం చర్మంపై మచ్చలను తొలగిస్తుంది.
ఇలా చేయండి: అరటి పండు తొక్కను మీ చర్మం మీద గుండ్రంగా రుద్దండి. ఇలా సుమారు 15 నిమిషాలు వరకు రుద్దండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీన్ని వారంలో రెండుసార్లు చేస్తే చాలు. ముఖం మీద ఏర్పడిన పెద్ద రంథ్రాలు క్రమేనా మాయమవుతాయి.
ముల్తాని మట్టీ: ముల్తానీ మట్టి కేవలం మొటిమలనే కాదు. చర్మం మీద ఏర్పడే రంథ్రాలను సైతం మాయం చేస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను పీల్చుకుని పెద్ద రంథ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది. చర్మంలోని మృత కణాలను సైతం తొలగిస్తుంది. వారానికి ఒకసారి ముల్తాని మట్టి రాస్తే.. రంథ్రాలు బిగువుగా మారతాయి.
ఇలా చేయండి: ముల్తానీ మట్టిని మీ ముఖాన్నికి బాగా రాసుకోండి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
❂ పసుపు: పసుపులోని సుగుణాలు గురించి మీకు తెలిసిందే. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గల పసుపు గుంతల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా రంథ్రాలు చుట్టూ ఏర్పడే వాపు తగ్గుతుంది.
ఇలా చేయండి: ఒక టీ స్పూన్ పసుపుకు కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసుకోండి. దాన్ని ముఖానికి రాయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి.
❂ ఓట్స్, పాలు: ఓట్స్ మంచి బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు. చర్మ సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ చర్మం మీద ఉండే ఆయిల్‌ను గ్రహిస్తుంది. అలాగే రంథ్రాలు, గుంతల పరిమాణాన్ని తగ్గిస్తుంది.
ఇలా చేయండి: రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో ఒక టేబుల్ స్పూన్ పాలు కలపండి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయండి. బాగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని కాసేపు రుద్దండి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.