‘పిల్లల్ని ఇండస్ట్రీలోకి పంపించడం మా నాన్నకు ఇష్టం లేదు. మొదట్లో నేను సినీ పరిశ్రమలోకి వస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు నా నటనను చూసి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. రాధికా ఆంటీ.. చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం ఎప్పుడూ సరదాగానే ఉంటాం. అయితే ఆమెకు ఏదైనా రహస్యం చెప్తే.. ఏదో ఒక సందర్భంలో మన ఎదుటే.. అందరికీ ఆ రహస్యాన్ని చెప్పేస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను ఇలాంటివి ఎదుర్కొన్నాను. వెంటనే నేను.. ఆంటీ.. అది సీక్రెట్.. కాబట్టి ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా అనేదాన్ని’ అని వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
రాధికా నోట్లో ఆవగింజ కూడా దాగదు
Related tags :