కరోనా మహమ్మారి ప్రభావంతో తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి చేయూత అందించారు. ఈ మేరకు గురువారం కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థినులకు రూ.50వేల ఉపకారవేతనాలను అందించారు. విద్యార్థినులు బి.గీత, వై.జోషిత ప్రకాశిని, బి.మమత, వై.లక్ష్మీ లిఖిత, బి.గాయత్రిలకు కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్ చేతుల మీదుగా ఉపకారవేతనాలు అందించారు.
పేద విద్యార్థుల పెన్నిధి…పొట్లూరి
Related tags :