‘గతాన్ని తల్చుకొని పశ్చత్తాపపడను. భవిష్యత్తుకు అందంగా తీర్చిదిద్దుకోవాలనే ప్రణాళికల్ని వేసుకోను. వర్తమానంలోనే జీవిస్తూ వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నా’ అని తెలిపింది తమన్నా. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదిహేనేళ్లయినా చక్కటి అవకాశాల్ని అందుకుంటోంది తమన్నా. ఈ ఏడాది ఓటీటీలో అరంగేట్రం చేయబోతున్నది. తన సినీ ప్రయాణాన్ని గురించి తమన్నా మాట్లాడుతూ ‘ విమర్శల్ని, అపజయాల్ని తల్చుకొని తొలినాళ్లలో చాలా బాధపడ్డా. నా కెరీర్ ముగిసిపోయిందని, కష్టాల్లో ఉన్నాననే వార్తలు చాలా సార్లు వచ్చాయి. నా ఆత్మవిశ్వాసాన్ని ఈ విమర్శలు దెబ్బతీయలేదు. అవన్నీ మరింత కష్టపడటానికి నాలో ప్రోత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం నంబర్‌గేమ్స్, స్టార్‌హీరోయిన్ అనే ముద్రలు తొలగిపోయాయి. ఎవరైనా కష్టపడాల్సిందే. అప్పుడే ఇండస్ట్రీలో కొనసాగగలుగుతాం. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. నా హార్డ్‌వర్క్‌కు అదృష్టం తోడవ్వడంతోనే పదిహేనేళ్లుగా అభిమానుల్ని అలరిస్తున్నా’ అని తెలిపింది.
నన్ను దెబ్బ కొట్టలేరు
Related tags :