గ్లామర్ బ్యూటీగా రాణిస్తున్న రిచా చద్దా తన తాజా చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’తో వివాదాల్లో చిక్కుకున్నారు. ‘అన్‌టచబుల్ అన్‌స్టాపబుల్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్ అనేక వివాదాలకు దారితీస్తున్నది. చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ రిచాను అసభ్యంగా తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. రిచా నాలుకను కోసిన వారికి బహుమతి కూడా ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో ఆక్షేపించాల్సిన విషయాలేవీ లేవనీ, ఓ దళిత మహిళ అనేకానేక సవాళ్లనూ సంక్షోభాలనూ ఎదిరించి రాజకీయాల్లో ఎలా ఎదిగిందన్నది తెరమీద చూపించడమే తమ లక్ష్యమనీ రిచా అంటున్నారు. ‘ఈ సినిమా దర్శకుడు ఓ సీనియర్ జర్నలిస్ట్. ఆయన చాలామంది రాజకీయ నాయకుల్ని దగ్గర నుంచీ పరిశీలించారు. రాజకీయాల్లో పాతుకుపోయిన కుల, లింగ వివక్షపై ఓ మహిళ ఎలా పోరాడిందో మేం కండ్లకు కట్టాం. ముందు సినిమా రానివ్వండి. తర్వాత మాట్లాడుదాం’ అని వాదిస్తున్నది రిచా. దేశవ్యాప్తంగా చాలామంది రిచాకు మద్దతు తెలిపారు. వారిలో నటి స్వరాభాస్కర్ కూడా ఉన్నారు. ఎందుకో, ఇలాంటి సందర్భాల్లో నటీమణులే టార్గెట్ అవుతున్నారు.
ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్న నెటిజన్లు
Related tags :