Politics

అఖిలప్రియ విడుదల. నిమ్మగడ్డకు చీఫ్ సెక్రటరీ ఝలక్-తాజావార్తలు

అఖిలప్రియ విడుదల. నిమ్మగడ్డకు చీఫ్ సెక్రటరీ ఝలక్-తాజావార్తలు

* బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియకు నిన్న బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను సికింద్రాబాద్‌ న్యాయస్థానం మంజూరు చేసింది. 15 రోజులకోకసారి బోయిన్‌పల్లి ఠానాలో సంతకాలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆమె విడుదలవుతున్న సందర్భంగా చంచల్‌గూడ జైలు వద్దకు అఖిలప్రియ బంధువులతో పాటు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. దీంతో జైలు పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారింది. హఫీజ్‌పేటలోని భూవివాదం నేపథ్యంలో ప్రవీణ్‌రావు, సునీల్‌ రావు, నవీన్‌రావు అనే ముగ్గురు సోదరుల కిడ్నాప్‌పై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దీనిలో భాగంగా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

* రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి ఢిల్లీ పోలీసుల అనుమతినిచ్చారు. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, గురువారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ ద్వారా తమ నిరసన తెలియజేయాలని భావించారు. అయితే, ఇందుకు తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు.

* హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు

* ప‌సుపు బోర్డు తెస్తాన‌న్న మాట త‌ప్పినందుకు వెంట‌నే ఎంపీ ప‌దవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే గ్రామ గ్రామాన అర‌వింద్‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ప‌సుపుబోర్డు, మ‌ద్ద‌తు ధ‌ర సాధించే వ‌ర‌కు త‌మ‌ పోరాటం కొన‌సాగిస్తామ‌ని పేర్కొంది.

* ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతికి దిల్లీ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2016లో ఎయిమ్స్‌ భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా కూడా విధించారు. అయితే, ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్‌ చేసుకొనేందుకు వీలుగా ఆయనకు బెయిల్‌ మంజూరైంది.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడి వలే పనిచేయాలని విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు.పట్టణ శివారు లక్షిపురం గ్రామంలో.జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు .వై సి పి ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి తిరువూరు నియోజకవర్గం లోని అధిక శాతం పంచాయతీలను స్వాదీనం చేసేందుకు నాయకులు ,కార్యకర్తలు సంఘటితం గా కృషిచేయాలని రఘురాం సూచించారు .ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి.దాసు ,నాలుగు మండ లాల పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

* వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని మార్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ‘ఒకే పన్ను – కనీస పన్ను’ వ్యవస్థ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పన్ను వ్యవస్థ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నడ్డి విరిచేసిందని ఆరోపించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరిశ్రమల వర్గాలతో మాట్లాడారు.

* ఏపీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ముట్టడికి యత్నించిన ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రిమాండ్‌ రిపోర్టులో అత్యాచార యత్నంగా పేర్కొనడంపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల సమస్యలపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థి నేతలు సీఎం నివాసానికి అర కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లగలిగారు. వారిని తెలుగు తల్లి విగ్రహం సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఐదుగురిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని శనివారం మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రిపోర్టులో అత్యాచారయత్నం అనే పదం వాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ నిలదీసినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు.. పాత ఎఫ్‌ఐఆర్‌ కాపీలను కంప్యూటర్‌లో మార్చే క్రమంలో ఆ పదాలను మార్చకుండా అలాగే వదిలేయడంతో ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను తిరిగి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిమాండ్‌ రిపోర్టులో మార్పులు చేసి సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ న్యాయమూర్తికి సమర్పించినట్టు సమాచారం.

* ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రోజురోజుకూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు.. ఎన్నికలు నిర్వహించి తీరుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోవైపు.. ఇలా ఏపీలో ప్రస్తుతం వాడీవేడి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖత చూపిస్తున్నాయి. ఇదేం లెక్కచేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.

* భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 150కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్తరకం కరోనా వైరస్‌ సోకిన వారిని ఆయా రాష్ట్రాల్లో ఒకే గదిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం గతంలో వెల్లడించింది. వారి సన్నిహితులను కూడా క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వారు తెలిపారు. వారితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తిస్తున్నామన్నారు. గత సెప్టెంబరులో బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌ 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే స్వభావంతో ఉంది.

* బెంగాల్‌ భూమి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సహా ఎంతో మంది మహోన్నత వ్యక్తులను దేశానికి అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా శనివారం కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ కూడా హాజరయ్యారు.

* దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 15,37,190 మందికి టీకా పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే (సాయంత్రం 6గంటల వరకు) 1,46,459 మందికి టీకా వేసినట్టు తెలిపింది. ఈ మేరకు దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా 13 దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ జాబితాలో బెహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రెజిల్‌, మాల్దీవులు, మారిషస్‌, మంగోలియా, మొరాకో, మయన్మార్‌, నేపాల్‌, ఒమన్‌, సెచెల్లాస్‌, శ్రీలంకలు ఉన్నాయి. భారత్ బయోటెక్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ను ఇప్పటికే 12 రాష్ట్రాల్లో పంపిణీ చేస్తుండగా.. అదనంగా మరో ఏడు రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు వెల్లడించారు.

* కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే 2021-22 బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏటా ఆనవాయితీగా నిర్వహించే హల్వా వేడుకను శనివారం సాయంత్రం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమక్షంలో నార్త్‌ బ్లాక్‌లో ఈ వేడుక జరిపారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాధారణంగా ఈ వేడుక జరిగిన తర్వాత బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభమవుతుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌ ప్రతులను ముద్రించడం లేదని కేంద్రం ఇదివరకే వెల్లడించింది.

* ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించడం, పాకిస్థాన్‌ను న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడించడం, శ్రీలంకపై ఇంగ్లాండ్‌ తొలి టెస్టు గెలవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జూన్‌లో లార్డ్స్‌ మైదానంలో జరగనున్ను ఫైనల్‌కు ఏ రెండు జట్లు అర్హత సాధిస్తాయని అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది.

* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి, డిండి ప్రాజెక్టు పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్షించారు. పంప్ హౌజ్‌లు, జలాశయాలు, కాల్వలు, సొరంగ మార్గాల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. బిల్లుల చెల్లింపుల కోసం తక్షణమే రూ.2వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. అంతేకాకుండా నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం అందించి భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

* కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం రాత్రి సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల కవాతులో తమలో నలుగురిని చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలిపారు. తద్వారా కవాతును భగ్నం చేసి ఆందోళనను అణదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఇందుకోసం రంగంలోకి దింపిన ఓ వ్యక్తిని తాము పట్టుకున్నట్లు తెలిపారు. ముఖానికి ముసుగు తొడిగిన అతణ్ని శుక్రవారం రాత్రి మీడియా ముందుకు తీసుకొచ్చారు. పోలీసు వలే నటించి కవాతులో రైతులపై లాఠీ చార్జి చేయాలని అతనికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణపై ముందస్తుగా సమాచారం అందించిన ఎస్‌ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)‌, డీజీపీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రారంభమైన కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, కొంత మంది జిల్లా స్థాయి అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సీఎస్‌, డీజీపీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కొన్ని జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు వేచి చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు రెండు మూడు నెలలు వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని.. ఎన్నికలపై ఎస్‌ఈసీకి ఎందుకింత ఆరాటం అని ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని చోట్లా కొవిడ్ వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు తొందరెందుకన్నారు. గడువు దాటినా చంద్రబాబు హయాంలో ఎందుకు ఎన్నికలు జరపలేదని నిలదీశారు. ఎన్నికల జరిగితే తెదేపాకు కనీసం 10 శాతం సీట్లు కూడా రావని బొత్స ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డతో లాలూచీపడి తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారమే కాదు, బాధ్యత కూడా ఉందని ఎస్‌ఈసీ గుర్తుపెట్టుకొని వ్యవహరించాలన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాలను దుర్వినియోగం చేయకూడదని బొత్స సూచించారు.

* ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శనివారం ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి.. వారు పని చేస్తున్న రెవెన్యూ డివిజన్లలో కాకుండా ఇతర చోట్ల విధులు వేయాలని కోరారు. పంచాయతీ ఎన్నికలను కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 68 రెవెన్యూ డివిజన్లలో నాలుగు‌ విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు విడతల్లో కలిపి 659 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలో 146 మండలాల్లో, రెండో‌ విడతలో 17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169మండలాల్లో, నాలుగో‌ విడతలో భాగంగా‌ 19 రెవెన్యూ డివిజన్లలోని 171మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనాపరమైన, న్యాయపరమైన వివాదాల కారణంగా 17 మండలాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించడం లేదు. అదే విధంగా విజయనగరం జిల్లాలో మూడో విడతలో, ప్రకాశం జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. మరి రెవెన్యూ డివిజన్‌ల వారీగా ఏయే మండలాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయో పూర్తి వివరాలు మీకోసం.. మీ మండలాన్ని బట్టి, ఏ దశలో ఎప్పుడు, మీ గ్రామంలో పోలింగ్‌ జరుగుతుందో తెలుసుకోవచ్చు.

దశల వారీగా పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు ఇవే!

శ్రీకాకుళం

తొలి విడత (05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మండలాలు: శ్రీకాకుళం ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మండలాలు: ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి

మండలాలు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి

మండలాలు: ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టాం, సీతంపేట, రేగిడి ఆమదాలవలస

విజయనగరం

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: పార్వతీపురం

మండలాలు: బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, సీతానగరం, తెర్లాం

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విజయనగరం

మండలాలు: భోగాపురం, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, డెంకాడ, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్‌.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, శృంగవరపుకోట, వేపాడ, విజయనగరం

విశాఖపట్నం

తొలి విడత (05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విశాఖపట్నం

మండలాలు: భీముని పట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: అనకాపల్లి

మండలాలు: అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నర్సీపట్నం

మండలాలు: నర్సీపట్నం, నాతవరం, రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం, గొలుగొండ, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: పాడేరు

మండలాలు: అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, డుంబ్రిగూడ, జి.మాడుగుల, జి.కె.వీధి, హుకుంపేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు

తూర్పుగోదావరి

తొలి విడత (05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: అమలాపురం

మండలాలు: అయినవల్లి, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మలికిపురం, ముమ్ముడివరం, మామిడికుదురు, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కాకినాడ, పెద్దాపురం

మండలాలు: గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి

గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: రాజమహేంద్రవరం

మండలాలు: ఆలమూరు, గోకవరం, కడియం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం

రెవెన్యూ డివిజన్‌: రామచంద్రాపురం

మండలాలు: కాజులూరు, అనపర్తి, బిక్కవోలు, కె.గంగవరం, కపిలేశ్వరపురం, మండపేట, రామచంద్రాపురం, రాయవరం

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: రంపచోడవరం

మండలాలు: అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి, వై.రామవరం

రెవెన్యూ డివిజన్‌: ఏటపాక

మండలాలు: చింతూరు, కూనవరం, వి.ఆర్‌పురం, ఏటపాక

పశ్చిమగోదావరి

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఏలూరు

మండలాలు: భీమడోలు, చింతలపూడి, దెందులూరు, ద్వారకా తిరుమల, ఏలూరు, గణపవరం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజెర్ల, నిడమర్రు, పెదపాడు,పెదవేగి, పెంటపాడు, టి.నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నర్సాపురం

మండలాలు: ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: అత్తిలి, చాగల్లు, దేవరాపల్లి, ఇరగవరం, కొవ్వూరు, నిడదవోలు, పెనుగొండ, పెనుమంత్ర, పెరవలి, తాళ్లపూడి, తణుకు, ఉండ్రాజవరం

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జంగారెడ్డిగూడెం, కుక్కునూరు

మండలాలు: బుట్టాయగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు

కృష్ణా

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నూజివీడు

మండలాలు: ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు,నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు విసన్నపేట, ఉయ్యూరు

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విజయవాడ

మండలాలు: చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గుడివాడ

మండలాలు: గుడివాడ, గుడ్లవల్లేరు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, నందివాడ, పామర్రు, పెదపారుపూడి, ముదినేపల్లి

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మచిలీపట్నం

మండలాలు: అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడురు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక

గుంటూరు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గుంటూరు

మండలాలు: అమరావతి, అచ్చెంపేట, బెల్లకొండ, గుంటూరు, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, ముప్పాళ్ల, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, వట్టిచెరుకూరు

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: తెనాలి

మండలాలు: అమర్తలూరు, బాపట్ల, బట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నరసరావుపేట

మండలాలు: బొల్లాపల్లి, చిలకలూరిపేట, ఎడ్లపాడు, ఈపూరు, నాదెండ్ల, నరసరావుపేట, నకిరేకల్లు, నూజెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గురజాల

మండలాలు: దాచేపల్లి, దుర్గి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి

ప్రకాశం

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఒంగోలు

మండలాలు: అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మార్కాపురం, కందుకూరు

మండలాలు: అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, మార్కాపురం, పెదారవడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం

దర్శి, దొనకొండ, తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కందుకూరు

మండలాలు: కొండెపి, జరుగుమల్లి, ఎస్‌.కొండ, మర్రిపూడి, సి.ఎస్‌.పురం, గుడ్లూరు, హెచ్‌.ఎం.పాడు, కందుకూరు, కనిగిరి, కె.కె.మిట్ల, లింగసముద్రం, పామూరు, పి.సి.పల్లి, పొదిలి, పొన్నలూరు, తర్లుపాడు, ఉలవపాడు, వెలిగండ్ల, వి.వి.పాలెం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నెల్లూరు

మండలాలు: బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, కొడవలూరు, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్‌, పొదలకూరు, రాపూరు, టి.పి.గూడూరు, వెంకటాచలం, విడవలూరు

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కావలి

మండలాలు: అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఆత్మకూరు

మండలాలు: అనంతసాగరం, ఏఎస్‌ పేట, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, మర్రిపాడు, సంగం, సీతారామపురం, ఉదయగిరి, వింజమూరు

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: గూడూరు, నాయుడు పేట

మండలాలు: బాలాయపల్లి, చిల్లకూరు, చిట్టమూరు, డక్కిలి, గూడూరు, కోట, సైదాపురం, వాకాడు, వెంకటగిరి, డి.వి.సత్రం, నాయుడు పేట, ఓజిలి, పెల్లకూరు, సూళ్లూరు పేట, తడ

కర్నూలు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఆదోని

మండలాలు: ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హలహర్వి, హోలగూడ, ఆస్పరి, కోసిగి, కౌతాలం, మంత్రాలయం, పెద్ద కడుబూర్‌, ఆదోని, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నంద్యాల, కర్నూలు

మండలాలు: ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యావాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నంద్యాల, కర్నూలు

మండలాలు: బనగానపల్లి, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, సంజమాల, గడివేముల, పాణ్యం, కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కోడుమూరు, కర్నూలు

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఆదోని, కర్నూలు

మండలాలు: మద్దికెర, పత్తికొండ, తుగ్గలి, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, మిడతూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచెర్ల, డోన్‌, పీపల్లి, కృష్ణగిరి, వెల్దుర్తి

అనంతపురం

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: పెనుకొండ

మండలాలు: ఆగలి, అమరాపురం, చిలమత్తూరు, గోరంట్ల, గుదిబండ, హిందూపురం, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, రొద్దాం, రోళ్ళ, సోమందేపల్లి

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కదిరి

మండలాలు: ఆమడగూర్‌, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట, నల్లచెరువు, నల్లమడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్‌

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ధర్మవరం, కళ్యాణదుర్గం

మండలాలు: రాప్తాడు, బత్తలపల్లి, చెన్నేకొతపల్లి, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, తాడిమర్రి, ముదిగుబ్బ, బెలుగుప్ప, బొమ్మనహళ్‌, బ్రహ్మసముద్రం, డి. హీరేహల్‌, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం, కంబదూర్‌, కనేకల్‌, కుందిర్పి, రాయదుర్గం, సెట్టూరు

నాలుగో విడత

రెవెన్యూ డివిజన్‌: అనంతపురం

మండలాలు: అనంతపురం, ఆత్మకూరు, బి.కె. సముద్రం, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్‌, కూడేరు, నార్పల, పామిడి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపానకాల్‌, యాడికి, ఎల్లనూరు

వైయస్సార్‌ కడప

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు, కడప

మండలాలు: పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల, లింగాల, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం, చక్రాయపేట, యర్రగుంట్ల

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు, కడప, రాజంపేట

మండలాలు: చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె. ఎన్‌, కలసపాడు, బి.మఠం

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కడప

మండలాలు: రాయచోటి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, కమలాపురం, వి.ఎన్‌ పల్లి, పెండ్లిమర్రి, సి.కె.దిన్నె, వల్లూరు, చెన్నూరు

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: రాజంపేట, కడప

మండలాలు: కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పెనగలూరు, పుల్లంపేట, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, టి. సుండుపల్లి, వీరబల్లి

చిత్తూరు

తొలి విడత(05-02-2021)

రెవెన్యూ డివిజన్‌: తిరుపతి

మండలాలు: బి.ఎన్‌ కండ్రిగ, చంద్రగిరి, కె.వి.బి. పురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదయ్యపాలెం, ఏర్పేడు

రెండో విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: చిత్తూరు

మండలాలు: బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి

మూడో విడత (13-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మదనపల్లి

మండలాలు: చిన్నఒట్టిగల్లు, యర్రావారిపాలెం, మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, గుర్రంకొండ, కె.వి. పల్లి, కలకడ, కలికిరి, పీలేరు, వాల్మీకిపురం, బి. కొత్తకోట, కురబలకోట, ములకలచెరువు, పి.టి.యం, పెద్దమండ్యం, తంబళ్లపల్లి

నాలుగో విడత (17-02-2021)

రెవెన్యూ డివిజన్‌: మదనపల్లి

మండలాలు: గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, పుంగనూరు, రొంపిచెర్ల, సోదాం, సోమల, చౌడేపల్లి, బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాని, వి.కోట