రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అద్భుత ఫలితాలిచ్చిన ప్రస్తుత ఐటీ విధానం పంథాలోనే వచ్చే అయిదేళ్ల (2021-26) కోసం త్వరలో కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. భారీ పెట్టుబడులు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలతోపాటు ప్రజలకు మరిన్ని ఆన్‌లైన్, మొబైల్ సేవలందించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రస్తుత ఐటీ విధానం అయిదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త విధానం రూపకల్పనపై శనివారం ఆయన టాస్క్ కార్యాలయ భవనంలో సమావేశం నిర్వహించారు. ఐటీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణాలో కొత్త ఐటీ విధానం
Related tags :