ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 162వ తెలుగు నెల నెలా తెలుగు వెన్నెల సాహితీ సదస్సు నిర్వహించారు. ప్రవాస బాలికలు సాహితీ-సింధూరలు నమో మారుతీ శ్లోకంతో కార్యక్రమం ప్రారంభమయింది. ముఖ్య అతిథిగా బులుసు వెంకటేశ్వర్లు హాజరయి “రామాయణ కల్పవృక్షము-వైశిష్ట్యము” అనే అంశంపై మాట్లాడుతూ విశ్వనాథ కవితా గుణాలను అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. “మన తెలుగు సిరిసంపదలు” ధారావాహిక లో భాగంగా యు.నరసింహారెడ్డి ఆధునిక కవుల ప్రసిద్ద కవితాపంక్తులను, ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన కృష్ణరాయల ఆముక్తమాల్యదలోని పద్యాలను, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” శీర్షకకు కొనసాగింపుగా, లెనిన్ బాబు వేముల మకరరాశికి, కాప్రికార్న్‌కు మధ్య పోలికలను ప్రస్తావించారు. సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి అతిథులకు, ఆహుతులకు ధన్యవాదాలు తెలిపారు.
టాంటెక్స్ 162వ సాహితీ సదస్సు
Related tags :