Kids

పిల్లల తెలివితక్కువతనానికి తండ్రులే కారణం

పిల్లల తెలివితక్కువతనానికి తండ్రులే కారణం

అమ్మానాన్నలిద్దరూ ఆరోగ్యంగా తెలివితేటలతో ఉన్నా వాళ్లకు పుట్టే పిల్లల్లో బుద్ధిమాంద్యం వచ్చిన కేసులు కనిపిస్తుంటాయి. దీనికి ఇంతవరకూ సరైన కారణాన్ని గుర్తించలేకపోయింది శాస్త్ర ప్రపంచం. అయితే వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు తండ్రుల జన్యువులే కారణం అంటున్నారు. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లల తండ్రుల్ని ఎంపికచేసి నిశితంగా గమనించగా- అందులో 28 శాతం పిల్లల తండ్రుల వయసు 40- 49 ఉండగా మిగిలిన 72 శాతం మంది పిల్లల తండ్రుల వయసు యాభై దాటిందట. దాంతో ఆటిజంతో బాధపడే పిల్లల తండ్రుల జన్యు క్రమాన్ని ఆటిజంలేని పిల్లల తండ్రుల జన్యువులతో పోల్చి చూశారు. అందులో మామూలుగా ఉన్న పిల్లల తండ్రుల శుక్రకణాల్లోని జన్యువుల పనితీరు సరిగానే ఉందనీ అదే ఆటిజంతో బాధపడే తండ్రుల జన్యువుల్లో తేడాలు స్పష్టంగా ఉన్నాయనీ తేలింది. దీన్నిబట్టి వయసు పెరిగేకొద్దీ వాతావరణ పరిస్థితులు, జీవనశైలి కారణంగా పురుషుల్లో కొన్ని రకాల జన్యువుల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందనీ ఆ కారణంతోనే పిల్లల్లో ఆటిజం వస్తుందనీ భావిస్తున్నారు.