Movies

మలైకపై నెటిజన్ల పిచ్చికూతలు

మలైకపై నెటిజన్ల పిచ్చికూతలు

ప్రసవం అయిన తర్వాత పొట్ట మీద మచ్చలు, చారలు ఏర్పడటం సహజం. దానికి సాధారణ మహిళల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ అతీతం కాదు. అయితే తాజాగా బాలీవుడ్‌ నటి మలైకా అరోరా వ్యాయామం చేసి బయటకు వచ్చిన సమయంలో ఆమె ఫొటోలను జనాలు క్లిక్‌మనిపించారు. ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా చాలా మంది ఆమె పొట్ట మీద ఉన్న స్ట్రెచ్ మార్కులను చూసి నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మలైకా ముసలిదైపోయిందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ ఎలా ఉంది? మీరెలా ఉన్నారని పోలుస్తూ ఆమెను కించపరుస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తల్లయ్యాక పొట్ట మీద మచ్చలు ఉండటం సర్వసహజమని చెప్పుకొస్తున్నారు. అయినా ఆమెను కావాలని టార్గెట్‌ చేస్తున్నారని, నిజానికి 40 ఏళ్ల వయసులో ఆమె ఎంతో అందంగా ఉందని, మీరైతే 20, 30 ఏళ్లకే ముడతలు పడ్డ వెల్లుల్లిలా కనిపిస్తారని ట్రోలింగ్‌ను తిప్పికొట్టారు.