రాత్రిపూట ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్రపట్టడం లేదా..? అయితే రోజూ రాత్రి నిద్రకు ముందు కొన్ని ద్రాక్షపండ్లను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే నిద్ర బాగా పడుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ద్రాక్షల్లో నిద్రకు ఉపయోగపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది. సాధారణంగా సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరి శరీరంలో మెలటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో రాత్రవుతున్న కొద్దీ ఎవరికైనా నిద్ర వస్తుంది. అయితే నిద్రలేమి ఉన్నవారిలో ఈ మెలటోనిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అందుకే వారికి నిద్ర సరిగ్గా పట్టదు. కనుక మెలటోనిన్ స్థాయిలను పెంచేందుకు ద్రాక్షలను తినాలి. దీంతో నిద్ర బాగా పడుతుందని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో తేల్చారు. మెలటోనిన్ ఎక్కువగా ఉండే బాదం పప్పు, అరటిపండ్లు, వాల్‌నట్స్, చెర్రీలు, తేనె తదితర ఆహారాలను తీసుకున్నా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
ద్రాక్షతో సుఖనిద్ర
Related tags :