తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి టెక్కలి పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చారు. విశాఖలోని ఆయన స్వగృహానికి బుధవారం వెళ్లి నోటీసు అందజేశారు.సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయం బయట నంది విగ్రహ ప్రతిష్ఠాపన ఘటనకు సంబంధించి కాశీబుగ్గ డీఎసీˆ్ప ముందు గురువారం విచారణకు హాజరు కావాలని అక్కడికి వెళ్లిన పోలీసులు స్పష్టం చేశారు. ఘటనలో పాల్గొన్నవారు ముందురోజు అచ్చెన్నాయుడిని కలిశారని, అందుకే విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. నోటీసు అందుకున్న అచ్చెన్నాయుడు ఈరోజు డీఎస్పీ ముందు హాజరు కానున్నట్లు సమాచారం. పాలేశ్వరస్వామి ఆలయంలో చెట్టు కింద ఖాళీగా ఉన్న నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి వెలుపల ఉన్న ఒక దిమ్మెపై ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక వైకాపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 16 మందిపై సంతబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కొందరు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున అచ్చెన్నాయుడిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిర్యాదులో పేర్లున్న కొందరు ఆయన్ను కలిసిన తర్వాతే ఈ ఘటన జరిగిందని, అందుకే ఆయన్ను కూడా విచారించేందుకే నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
అచ్చెన్నాయుడిపై సరికొత్తగా మరికొన్ని కేసులు
Related tags :