ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో యూట్యూబులో వర్చ్యువల్ గా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సమీర ఇల్లెందుల వ్యాఖ్యానంలో సమన్వయకర్త సరిత ఈదర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి ప్రసంగిస్తూ సంస్థకు అందిన కరోనా విరాళాలను ఆంధ్రా, తెలంగాణా, డల్లాస్‌లలో వినియోగానికి విరాళంగా అందించినట్లు తెలిపారు. అనంతరం అధ్యక్షురాలు పాలేటి లక్ష్మీని పరిచయం చేశారు. ఆమె సంక్రాంతి శుభాకంక్షలు అందజేసిన అనంతరం ప్రసంగిస్తూ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. డాలస్ తెలుగు వారి కోసం సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. ఉమా మహేష్ పార్నపల్లి ఉత్తరాధ్యక్షుడుగా, శరత్ రెడ్డి ఎర్రం ఉపాధ్యక్షులుగా, సాంస్కృతిక కార్యదర్శి సురేష్ పఠానేని, కళ్యాణి తాడిమేటి కార్యదర్శిగా, శ్రీకాంత్ రెడ్డి జొన్నల సహాయ కార్యదర్శిగా, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి కోశాధికారిగా, స్రవంతి ఎర్రమనేని సహాయ కోశాధికారిగా, పాలక మండలి అధ్యక్షుడిగా డాక్టర్ పవన్ పామదుర్తి, పాలక మండలి మాజీ అధ్యక్షుడు పవన్ నెల్లుట్ల తదితరులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగు వెలుగు సంపాదకులు స్రవంతి సంక్రాంతి సంచికను ఆవిష్కరించారు. హరిదాసు (ప్రశాంత్ కుమార్), గంగిరెద్దు మేళం, డాక్టర్ అరుణ సుబ్బారావు తోలుబొమ్మలాట, పేరడీ జానపద గేయాలు, హేమాంబుజ కట్టా వీణామృతం, నాని బృందం కోలాటం, సినీ గాయని ఉషా విభావరి, లాస్య సుధా అకాడమీ నుంచి కీర్తన, నర్తన కలవగుంట సోదరీమణుల నృత్య ప్రదర్శనలు, రాగలీనా అకాడమీ స్వప్న గుడిమెళ్ళ శిష్యుల శాస్త్రీయ జానపద నృత్యం ఆకట్టుకున్నాయి.
హరిదాసు తోలుబొమ్మలాటలతో సందడిగా టాంటెక్స్ సంక్రాంతి
Related tags :