కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్-ప్రభాస్ కాంబోలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో జరగనున్న చిత్రీకరణలో ప్రభాస్-శ్రుతిహాసన్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ తర్వాత కథానాయకుడు ప్రభాస్ నుంచి రానున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. గురువారం శ్రుతి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. చిత్ర బృందం ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సలార్‌లోకి శ్రుతికి స్వాగతం. మిమ్మల్ని తెరపై చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. దీనిపై శ్రుతిహాసన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బదులిస్తూ.. ‘‘చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం నేనెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా’’ అంది. ప్రశాంత్ నీల్ శైలిలో సాగే ఓ పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలో గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
KGF దర్శకుడితో శృతి-ప్రభాస్ “సలార్”
Related tags :