* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిండికేట్ బ్యాంక్‌లో కోటి రూపాయల స్కామ్ బయటపడింది.భీమవరం మండలం తుందుర్రుకు చెందిన రైతు ఆరేటి జగన్మోహనరావు మరణించారు.2012లో మరణించిన రైతు జగన్ మోహనరావు పేరిట 2015లో అజ్ఞాత వ్యక్తికి ఆయన పేరు మీద బ్యాంకు అధికారులు రుణం ఇచ్చారు.అజ్ఞాత వ్యక్తి కోటి రూపాయల రుణం పొందారు.వ్యవసాయ పొలానికి చెరువుగా బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేశారు.తాజాగా లోను కోసం జగన్మోహన రావు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పటికే మీ భూమిపై కోటి రూపాయలు రుణం తీసుకున్నారని బ్యాంకు అధికారులు చెప్పడంతో బాధితులు ఖంగుతిన్నారు.బ్యాంకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* హైదరాబాద్‌లో 5జీ సేవలందించేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. దీనివల్ల 5జీ ఫోన్ నుంచి ఫుల్‌లెంత్ సినిమాను సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతోపాటు సరిపడా స్పెక్ట్రం జారీ విడుదల చేసిన తర్వాత 5జీ సేవలు వినియోగదారులకు లభ్యం కానున్నాయి. తద్వారా దేశంలో తొలిసారి విజయవంతంగా 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చిన సంస్థగా ప‌్రముఖ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ నిలిచింది.ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోకమర్షిల్ నెట్‌వర్క్ పరిధిలో తమ సంస్థ వినియోగదారులకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.
* ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయునది ఏమనగా జనవరి నుండి పూర్తిగా యూనియన్ బ్యాంక్ లోకి మార్చడం జరిగింది.
1. అకౌంట్ నంబర్ పాతదే ఉంటుంది.
2. కస్టమర్ ఐడి పాతదే ఉంటుంది.
3. కొత్త పాస్ బుక్ యూనియన్ బ్యాంకు ముద్ర తో వస్తుంది.
4. ఆంధ్ర బ్యాంక్ చెక్ బుక్ లో 31/03/2021తారీఖు వరకు మాత్రమే పనిచేస్తాయి తరువాత పని చేయివు. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంకు చెక్కు బుక్కులు కొత్తవి తీసుకోవాలి.
5.ఆంధ్ర బ్యాంక్ ifsc కోడ్ 31/03/ 2021 వరకు మాత్రమే పని చేస్తది. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్ IFSC కొత్త కోడ్ మీ దగ్గరి లో యూనియన్ బ్యాంక్ లేదా (ఆంధ్రబ్యాంక్) తెలుసుకోవలెను. ఇంకా ఏమైనా నా సందేహాలు ఉంటే యూనియన్ బాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కి1800 208 2244 ఫోన్ చేయగలరు.
6.మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు U-mobile app అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ Install చేసుకోవాలి పాత (App ab tej) పని చేయదు కాబట్టి.
* బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని మరోమారు తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ.త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు చేరుకున్నారు రాహుల్.లాక్డౌన్లో భారత బిలియనీర్ల సంపద రెట్టింపైందన్న ఆక్స్ఫామ్ నివేదికను మీడియాతో పంచుకున్న రాహుల్.. కొందరు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ప్రధాని దేశాన్ని నడుపిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు.ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం సహా.. ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు.
*