Politics

ఏపీలో 1315 సర్పంచ్ నామినేషన్లు-పంచాయతీ పోరు ప్రత్యేకం

1315 People File Nominations For Sarpanches In 2021 Andhra Local Elections

* పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టివేసింది. 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవడం.. పంచాయతీ నోటిఫికేషన్‌ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. నామినేషన్లు ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేమని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. 2021 ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడంతో.. 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకున్నామని ఎస్‌ఈసీ న్యాయవాది వాదించారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.

* సర్పంచ్‌ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1315 నామినేషన్లు వేశారు. 2200 వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధిక నామినేషన్లు దాఖలు చేశారు. అనేక మలుపులు, ఉత్కంఠ పరిణామాల అనంతరం… పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఫిబ్రవరి 9వ తేదీన 12 జిల్లాల్లో 18 డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) వీటన్నింటికీ కలిపి 23న ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఫిబ్రవరి 5న తొలివిడత పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ… కోర్టులో కేసు, ప్రభుత్వ సహాయ నిరాకరణ తదితర కారణాలతో తొలివిడత పోలింగ్‌ను ఫిబ్రవరి 21కి మార్చారు. మిగిలిన విడతల ఎన్నికలు యథాతథంగా జరుగనున్నాయి. ఇందులోభాగంగా 12జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు 9వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

* రాష్ట్ర ఎన్నికల కమీషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ ఫిబ్రవరి 2వ తేదీన కాకినాడలో పర్యటిస్తారు. ఆయన 2వ తేదీ ఉ.10-30 గం.లకు విశాఖపట్నం నుండి బయలుదేరి12-30 గం.లకు కాకినాడ చేరుకుంటారు. మద్యాహ్న భోజనానంతరం మ.1-30 గం.ల నుండి 2-30 గం.ల వరకూ జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు, డిఐజి, పోలీస్ సూపరింటెండెంట్లు, ఏఎస్పిలు, డిఎస్పిలు, ఆర్డిఓలు, జడ్పి సిఈఓ,జిల్లా పంచాయతీ అధికారి తదితర గ్రామ పంచాయత్ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని, తదుపరి 3-00 గం.లకు బయలుదేరి ఏలూరు వెళతారు.

* మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వని నిమ్మగడ్డ రమేష్.టీడీపీ మ్యానిఫెస్టోపై ఏం చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న కు సమాధానం ఇవ్వని నిమ్మగడ్డ.సజ్జల , విజయసాయిరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలకు ఎందుకు కోరారన్న దానిపై స్పందించిన నిమ్మగడ్డ.ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ.ఉండవయ్యా అంటూ గద్దించిన నిమ్మగడ్డ.నిమ్మగడ్డ మరో వివాదస్పద నిర్ణయం.ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ప్రాంతాలను హైసెన్సిటివ్ ప్రాంతాలుగా ప్రకటన.ఏకగ్రీవం అయిన స్థానాలను పంచాయతీ ఎన్నికల్లో సున్నితమైన ప్రాంతాలుగా గుర్తింపు.వివాదస్పద నిర్ణయం ఎందుకంటూ నిమ్మగడ్డ ను ప్రశ్నించిన మీడియా.సమాధానం చెప్పని నిమ్మగడ్డ.