* దేశరాజధాని దిల్లీలోని ఇజ్రాయల్ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* పరవాడ మండలంలో సింహాద్రి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి తలపై కొట్టి.. టవల్‌తో గొంతుబిగించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి గొరుసువానిపాలెంకు చెందిన గొరుసు రామిరెడ్డి (30) ఐటీఐ పూర్తి చేసి సుమారు పదేళ్లుగా సింహాద్రి ఎన్టీపీసీ సీఅండ్‌ఐ విభాగంలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు. అలాగే రుణాలు ఇచ్చి వసూలు చేసే వ్యవహారాలూ నిర్వహిస్తున్నారు. మరడ దాసరిపేటకు చెందిన నాగమణితో 2017లో అతడికి వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్లపాప హీక్షిత, ఎనిమిది నెలల కుమారుడు చేతన్‌వెంకట్ ఉన్నారు. రామిరెడ్డి అత్తింటివారు పేదలు కావడంతో ప్రస్తుతం కొబ్బరి, అరటిపళ్లు దుకాణం పెట్టుకుని కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నారు. పిల్లలకు కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని రెండు వారాలుగా భార్య, పిల్లలను కూర్మన్నపాలెంలోని అత్తవారి ఇంటిదగ్గరే రామిరెడ్డి ఉంచాడు. విధులు ముగిసిన తర్వాత స్వగ్రామమైన గొరుసువానిపాలెం వెళ్లి కొంత సమయం ఉండి మళ్లీ రాత్రికి అత్తగారింటికి వచ్చేవారు. ఇలా వచ్చే క్రమంలోనే హత్య జరిగింది. ఎన్టీపీసీ- సోమునాడుపాలెం రహదారి పక్కన రామిరెడ్డి మృతదేహం రహదారికి సుమారు 20 మీటర్ల్లు దూరంలో శరీరంపై చొక్కా లేకుండా పడి ఉంది. ఘటనను బట్టి చూస్తే రామిరెడ్డిని బుధవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత నిందితులు అక్కడికి రప్పించి తొలుత ఘర్షణపడి అనంతరం కాళ్లు చేతులు పట్టుకుని…మెడచుట్టూ టవల్‌తో బిగించి చంపి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. సౌత్ ఏసీపీ రామాంజనేయులురెడ్డి, పరవాడ సీఐ ఉమామహేశ్వరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుని సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
* చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తంనాయుడిని విశాఖ కస్టోడియన్ కేర్‌కు తరలించాలని రుయా వైద్యులు సూచించారు. వారి మానసికస్థితి సరిగా లేనందున.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని రెండు రోజుల క్రితం జైలు అధికారులకు వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం ఉదయం నిందితులను జైలు నుంచి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. నిందితులిద్దరికీ మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పురుషోత్తం, పద్మజకు కస్టోడియన్ కేర్ కావాలని వైద్యులు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా వైద్యులు తెలిపారు.
*
* కృష్ణా జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతమైన వాతావరణం లో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే, అక్రమ నగదు, మద్యం సరఫరాకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలియజేయాలంటే 9491068906.
* దిల్లీ-హరియాణా సరిహద్దు సింఘులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఆందోళనకు దిగారు.
* ఏసీబీ కోర్ట్ లో రేవంత్ రెడ్డి కి చుక్కెదురు…ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్ట్..ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి పిటీషన్..రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్ట్.ఓటుకు కోట్ల కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా.ఫిబ్రవరి 8న నిందితులు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశం.