అమెరికాకు చెందిన భరత్ నారుమంచి అనే భారతీయ డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను కాల్చి చంపాడు. అనంతరం భరత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భరత్‌కు టెర్మినల్ క్యాన్సర్ నిర్ధారణైందని పోలీసులు తెలిపారు. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం చిల్డ్రన్స్ మెడికల్ గ్రూప్ ఆఫీసుల్లోకి డాక్టర్ భరత్ తుపాకీతో వచ్చి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నాడు. అందరూ తప్పించుకోగలిగినా కాథరిన్ డాడ్సన్ అనే డాక్టర్ మాత్రం చిక్కుకుపోయారు. పోలీసులు బలవంతంగా బిల్డింగ్‌లోకి ప్రవేశించగా డాడ్సన్, భరత్ చనిపోయి కనిపించారు. డాడ్సన్‌ను కాల్చిచంపిన అనంతరం భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
అమెరికాలో…వైద్యురాలిని కాల్చి చంపిన వైద్యుడు నారుమంచి భరత్
Related tags :