వంటల వీడియోల ద్వారా ఫేమస్ అయిన తమిళనాడుకు చెందిన ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ నిర్వాహకులతో కలిసి రాహుల్ గాంధీ గరిఎట్ తిప్పారు. తన మనవళ్లతో కలిసి పెరియతంబి చేసే వంటలకు ఏకంగా 77లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే వీరి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీరు ఇటీవల ప్రకృతి అందాల మధ్య పుట్టగొడుగుల బిర్యానీ తయారీని వీక్షకులకు చూపిస్తున్నారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా అక్కడికి వెళ్లి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. వారితో కలిసి కొన్ని వంటకాల్లో గరిటె కూడా తిప్పారు. అనంతరం ప్రకృతి అందాల మధ్య నేలపై పరిచిన తాటాకుల చాపల్లో వారి మధ్యే కూర్చొని రాహుల్ బిర్యానీ ఆరగించారు.
వంటల వీడియోల్లో రాహుల్ గాంధీ
Related tags :