భారత్‌తో పాటు పలు దేశాల అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతిస్తున్నట్లు రష్యా శనివారం వెల్లడించింది. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ రష్యా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సూచన మేరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు రష్యా ప్రభుత్వం అనుమతినిచ్చింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు ఇందులో ఉన్నాయి.’’ అని వారు పేర్కొన్నారు. వారానికి రెండు సార్లు దిల్లీ నుంచి మాస్కోకు విమానాలు నడవనున్నట్లు సమాచారం. విద్యార్థి వీసాలతో సహా భారతీయులకు వీసాలిచ్చే కార్యక్రమం తిరిగి కొనసాగనుందని వారు తెలిపారు. ఈ-వీసాలను ఇచ్చేందుకు మరికాస్త సమయం పడుతుందన్నారు. ప్రయాణీకులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టుతో పాటు అన్ని వైద్య పత్రాలను తెచ్చుకోవాలని వారు ఆ ప్రకటనలో సూచించారు.
బోర్ కొడుతోందా? రష్యా రమ్మంటోంది.
Related tags :