Health

ఆరోగ్య రంగం హుషార్

ఆరోగ్య రంగం హుషార్

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ హెల్త్‌ కేర్‌ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగతున్నాయి. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని  ప్రకటించిన నేపథ్యంలో హెల్త్‌ కేర్‌ షేర్లు ఒక్కసారిగా జూమ్‌ అయ్యాయి. నారాయణ హెల్త్‌ కేర్‌ 2 శాతం, అపోలో ఒకశాతం, గ్లోబల్‌హెల్త్‌ కేర్‌ ఫోర్టిస్‌ 2 శాతానికి పైగా లాభాలతో కొనసాగున్నాయి.  దీంతో సెన్సెక్స్‌ 936 పాయింట్లు ఎగిసి 47 వేలను అధిగమించింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 13875 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్‌,హెల్త్‌ కేర్‌  రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.