Editorials

కాశ్మీర్‌పై పాకిస్థాన్ సైన్యాధిపతి వ్యాఖ్యలు

కాశ్మీర్‌పై పాకిస్థాన్ సైన్యాధిపతి వ్యాఖ్యలు

భారత్‌తో సంబంధాలపై పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా కీలక వ్యాఖ్యలు చేశారు. దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్‌ వివాదాన్ని ఇరు దేశాలు హుందాగా, శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్థాన్‌ శాంతిని కోరుకునే దేశమని.. పొరుగువారితో కలిసుండాలని ఆకాంక్షిస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని దిశల్లో శాంతిని పంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఖైబర్‌ రాష్ట్రంలోని ‘పాకిస్థాన్ వాయుసేన అకాడమీ’లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.