ఆధార్ కార్డులో మార్పులు చేయాలనుకుంటున్నారా ? ఇక ఇంటి నుంచే ఆ పని చేసుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో యూఏడీఏఐ కొన్ని కొత్త అవకాశాలు కల్పిస్తున్నది. ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండా.. ఇంటి నుంచే మార్పులు చేసుకునే వీలు కల్పిస్తున్నది. 1947 ఆధార్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. చాలా వరకు సేవలు పొందే వెసలుబాటు కల్పించారు. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేస్తే.. మీ సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రాల వివరాలను వెల్లడిస్తారు. అయితే ఆన్లైన్లో జరిగే మార్పులు గురించి కూడా వెల్లడించారు. ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండానే.. పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్, లాంగ్వేజీని మార్చేందుకు వీలు కల్పించారు. కానీ కుటుంబ పెద్ద లేదా గార్డియన్ డిటేల్స్ లేదా బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేయాలంటే మాత్రం కచ్చితంగా ఆధార్ సేవా కేంద్రాలు లేదా ఎన్రోల్మెంట్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది.
ఫోను చేయండి. ఆధార్ అప్డేట్ చేసుకోండి.
Related tags :