Devotional

APSRTC ప్రయాణీకులకు తిరుమల వెంకన్న దర్శన సౌకర్యం-తాజావార్తలు

APSRTC Passengers To Get TTD Darshan Tickets In Buses

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. ఏపిఎస్ఆర్టీసీ ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సదవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, ఈ.ఓ. కే.ఎస్. జవహార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

* బ్ర‌హ్మోత్స‌వాల్లోపు తిరుమ‌ల‌లోని కాటేజిల‌న్నీ అందుబాటులోకి తీసుకురావాలి – టిటిడి ఈవోతిరుమ‌లలో మ‌ర‌మ‌త్తుల‌కు గురైన కాటేజిల ప‌నుల‌ను శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాల‌లోపు పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గురువారం ఆయ‌న అధికారుల‌తో స‌మావే‌శం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమ‌ల‌లో వివిధ కాటేజిల మ‌ర‌మ‌త్తుల ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ద‌శ‌ల వారీగా ప్రారంభ‌మైన ఈ ప‌నుల‌న్నీ బ్ర‌హ్మోత్స‌వాల నాటికి అన్ని స‌దుపాయాల‌తో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

* దివ్యాంగులు లేదా అంగ‌వైక‌ల్యం ఉన్న‌వారు.. టోల్ ప్లాజాల వ‌ద్ద ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా సంస్థ మంత్రి నితిన్ గ‌డ్క‌ర్ తెలిపారు.ఇవాళ లోక్‌స‌భ‌లో ఆయ‌న ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ ఈ విష‌యాన్ని చెప్పారు.దివ్యాంగుల‌కు టోల్ ఫీజు నుంచి మిన‌హాయింపు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.అలాంటి వ్య‌క్తుల కోసం ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను ఎత్తివేసిన‌ట్లు ఆయన చెప్పారు.యూజ‌ర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగుల‌కు వాహ‌నాల‌ను డిజైన్ చేయాలంటూ కంపెనీల‌ను కూడా ప్రోత్స‌హిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.దివ్యాంగుల‌కు టోల్ ఫీజు మిన‌హాయింపు క‌ల్పిస్తున్నారా అని బీజేపీ ఎంపీ ర‌మేశ్ బిదురీ ఇవాళ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో గ‌డ్క‌రీ ఆ ప్ర‌శ్న‌కు బ‌దులు ఇచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

* పాఠశాలల వేళలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు.

* APలో 4వ దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్…☞ ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ.☞ ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు.☞ ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన.☞ ఫిబ్రవరి 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన.☞ ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం.☞ ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.☞ ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు).☞ ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.

* నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధిపురం పంచాయతీలో వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. భాజపా మద్దతదారును నామినేషన్‌ వేయనీయకుండా అడుగడుగునా అడ్డు తగిలారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపురం సర్పంచ్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడి వైకాపా వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో వారి తరఫున గురువారం (ఆఖరిరోజు) వరకు ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.

* ఆ ఊరు ఎన్నో పంచాయతీ ఎన్నికలు చూసింది. ఎంతో మంది సర్పంచుల్ని ఎన్నుకుంది. కానీ పల్లె పోరులో ఒక్కరూ ఓటు వేయలేదు. ఒకట్రెండు కాదు నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఇదే ఆనవాయితీ. పార్టీలుండవ్‌.. పంతాలుండవ్‌.. కేసులుండవ్‌.. కొట్లాటలుండవ్‌. అంతా ఒకే మాట.. ఒకటే బాట. అందుకే 40 ఏళ్లుగా ఆ పంచాయతీ సామరస్య ఏకగ్రీవానికి చిరునామాగా నిలుస్తోంది.

* కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో వచ్చే నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా, కరోనా వ్యాక్సిన్‌ తీసుకునే ముందు, లేదా తీసుకున్న తర్వాత పెయిన్‌ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని స్పష్టంచేస్తున్నారు. వీటిపై ఆధారాలు తక్కువగానే ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ పనితీరును నొప్పి నివారణ మందులు(పెయిన్‌ కిల్లర్లు) ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు.

* ఫిబ్రవరి 13నుంచి ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ రెండో డోసును అందించనున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ..దేశంలో గురువారం మధ్యాహ్నం 1.30 వరకూ 45,93,427 మందికి వ్యాక్సిన్‌ అందించామన్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.60లక్షలు ఉన్నాయని తెలిపారు.

* 2014 నుంచి ఇప్పటిదాకా 296 మొబైల్‌ యాప్‌లను బ్లాక్‌ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రె రాజ్యసభలో వెల్లడించారు. ఐటీ చట్టం- 2000లోని 69ఏ సెక్షన్‌ నిబంధనల ప్రకారం ఈ యాప్‌లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వేదికల్లో లభ్యమవుతున్న కొన్ని చైనా యాప్‌లు సమాచారాన్ని తస్కరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నాయన్న సమాచారం మేరకు ఈ నిషేధం విధించినట్టు చెప్పారు.

* మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు. కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల క్రితమే దిల్లీకి వెళ్లి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహించనున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్‌గా నియమితులు కానున్నందున ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ సమాచారం ఇచ్చింది.

* ఈ మధ్యకాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో భాషల అంతరాలు తొలిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కుతున్నాయి. అదే క్రమంలో కన్నడలో స్టార్‌ హీరో దర్శన్‌ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాబర్ట్‌’ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. శాండల్‌వుడ్‌లో అభిమానులు ముద్దుగా ‘డ్బాస్‌’ అని పిలుచుకునే దర్శన్‌ తెలుగులో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

* దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు అనుకూలంగా ప్రపంచ సెలబ్రెటీలు, ఉద్యమకారులు చేస్తున్న ట్వీట్లపై కేంద్రం మండిపడుతోంది. ఇదే అంశంపై తాజాగా భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. ఇది భారత ప్రతిష్ఠను మసకబార్చేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర అన్నారు. దేశంలో గందరగోళం సృష్టించి అశాంతి రేపేందుకు ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

* దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పసిడి ధర తగ్గుముఖం పట్టింది. గురువారం రూ.322 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన(24 క్యారెట్లు) పుత్తడి రూ. 47,135 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 68వేల దిగువకు పడిపోయింది. రూ. 972 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 67,170గా ఉంది.

* ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌కే అవకాశం ఇస్తున్నామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె తనకు గొప్ప సహచరుడని వెల్లడించాడు. మైదానంలోనే కాకుండా బయటా తమ మధ్య చక్కని అనుబంధం ఉందని స్పష్టం చేశాడు. దేశంలో జరిగే పరిణామాలపై జట్టు సభ్యులందరం అభిప్రాయాలు పంచుకుంటామని తెలిపాడు.