ఆడవాళ్లతో పోలిస్తే కొవిడ్ వల్ల మగవాళ్లే ఎక్కువ బాధపడుతున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంటోంది. ఇందుకోసం వీళ్లు దాదాపు లక్ష కేసుల్ని విశ్లేషించగా- వైరస్ పాజిటివ్ వచ్చి ఇంటెన్సివ్ కేర్లో చేరి చికిత్స తీసుకున్నవాళ్లలో అత్యధికులు మగవాళ్లేనట. ప్రదేశం, సంస్కృతి, సంప్రదాయంతో సంబంధం లేకుండా విభిన్న దేశాలను పరిశీలించినప్పుడు- మగవాళ్లే ఎక్కువగా దీని బారినపడినట్లు తేలింది. వాళ్లు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కు ధరించకపోవడం, పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగడమే కారణం అని మొదట్లో భావించారు. తరవాత క్షుణ్ణంగా పరిశీలించగా- పురుషుల ఊపిరితిత్తుల కింది భాగంలో ఎసిఇ2 రిసెప్టర్లు అధికంగా ఉన్నాయనీ అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్ సమస్య తీవ్రంగా ఉందనీ గుర్తించారు. అంటే- కొన్ని అనారోగ్య సమస్యలకి పుట్టుకతో వచ్చిన శరీర నిర్మాణమే కారణం అంటున్నారు పరిశోధకులు.
కోవిద్ బాధలు మగవారికే ఎక్కువ
Related tags :