DailyDose

శంషాబాద్ విమానాశ్రయంలో కామాంధ ఉద్యోగి-నేరవార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో కామాంధ ఉద్యోగి-నేరవార్తలు

* శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎజైల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌లోని మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సంస్థ అడ్మిన్‌ శ్రీకాంత్‌ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తనతో గడిపితేనే ఉద్యోగాలు ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాంత్‌ ఆగడాలను తట్టుకోలేక ఎనిమిది మంది బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

* దశాబ్దాలుగా ఎంతో వివాదాలతో నడుస్తున్న ఒడిశా ఆంధ్రప్రదేశ్ వివాదాస్పద 21 గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా తనకి నచ్చినట్లు చొచ్చుకువచ్చి తమ ప్రభుత్వకార్యక్రమాలు నిర్వహిస్తుంటే జిల్లాలో అధికారులు, రాష్ట్రంలో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు.. విజయనగరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో కోఠియా గ్రూప్ గ్రామాలైన 21 గ్రామాలున్నాయని వాటిలో గంజాయిభద్ర,పగలుచెన్నూరు తో పాటు కొన్నిగ్రామాలు సారిక,కరుకూటి పంచాయతీ పరిధిలో కొన్ని గ్రామాల్లో దశాబ్దాలుగా పైగా ఒడిశా ఆంద్రప్రదేశ్ కి సరిహద్దు ప్రాంతాల్లో వివాదాలు జరుగుతూనే ఉన్నాయని గతంలో విజయనగరం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కలెక్టర్ వివేక్ యాదవ్ సరిహద్దు గ్రామాల్లో పర్యటించి గిరిజనులకు వసతులు కల్పించి సరిహద్దులు పక్కాగా ఏర్పరిచారని,ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం తో కనీసం చర్చలు కూడా లేకుండా గడచిన 4 నెలలుగా మన సరిహద్దు ప్రాంతాల్లో చొరబడి మన పాఠశాలలు కి ఉన్న రంగులు చేరిపేసి తమ ఒరియా భాషను రాసాయని అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారులు కనీసం స్పందించలేదని ఆరోపించారు, ప్రస్తుతం ఎన్నికల కోడ్ గిరిజన ప్రాంతాల్లో అమలులో ఉండగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వర్చువల్ గా మీట నొక్కి శుక్రవారం అత్యవసరంగా 150 కోట్ల రూపాయలు తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఇది పూర్తిగా సరిహద్దు ఉల్లంఘన గా తీసుకోవలసిందేనని, దూరద్రుష్టిని కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర యంత్రాంగం ఉలుకూపలుకు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు ఒడిశా ప్రభుత్వం గతంలో గంజాయిభద్ర,కోఠియా వరకే తమ పర్యటన లు పరిమితం చేసుకునేవారని మన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అలుసు చూసుకొని నెరేళ్లవలస కి కూడా చేరుకుని తమ పనులు చేస్తున్నారని భీశెట్టి విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విలువైన సంపద కోల్పోతుందని వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసామని భీశెట్టి తెలిపారు.

* శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ను కలిసిన టిడిపి నాయకులు.ఎస్పీకి వినతిపత్రం అందజేసిన మాజీమంత్రి కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ చట్టం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయిపోతుందని.రాష్ట్రంలో ఎన్నికల సంఘంపైన ప్రభుత్వం నుంచి దాడి జరుగుతోందిని.ఎస్.ఈ.సి పై అధికార పార్టీ నాయకులు మానసిక ఒత్తిడి తెస్తున్నారాని అంతేకాకుండావైసిపి ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారాని అన్నారు.నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిని వైసిపి నాయకులు భయపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారా నిఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులుపై ఉందిని ఈ సందర్భంగా తెలియజేశారు.

* విజయనగరం మండలం జమ్ము నారాయణపురం గ్రామంలో ఇటీవల చోరీకి గురైన స్విఫ్ట్ డిజైరు కారు మిస్టరీని చేధించినట్లుగా విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు.విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వెంకటరాయుడుపేటకు చెందిన భూపతి రవికుమార్ తన గ్రామం నుండి విజయనగరం మండలం జమ్మునారాయణపురంకు వలస వచ్చి, కారులను అద్దెకు తిప్పుతున్నారు. బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన దూపం వినోద్ కుమార్ అనే వ్యక్తి తనను విఆర్వోగా పరిచయం చేసుకుంటూ, తన ఆధార్ కార్డు, ఫోను నంబరు, విఆర్వోగా తప్పుడు గుర్తింపు కార్డుతో ఎపి 39వ 6467కారును ఒక్క రోజుకు అద్దెకు తీసుకున్నారు. సదరు కారును దూపం వినోద్ కుమార్ తీసుకొని వెళ్ళిపోయి, మరుసటి రోజు తిరిగి తీసుకొని రాకపోవడంతో, ఫిర్యాది రవికుమార్ ఫోను చేసి వినోద్ కుమార్ ను అడుగగా, మరో రోజు తనకు కారుతో పని ఉన్నట్లు,అదనంగా అద్దె చెల్లిస్తానని తెలపడంతో అందుకురవికుమార్ అంగీకరించాడు. కానీ, మరుసటి రోజు ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో, అనుమానం వచ్చి విజయనగరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా,పోలీసులు క్రెం నంబర55/2021 సెక్షను 379 ఐపిసిగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందంను టోల్ గేటుల వద్ద విచారణకు పంపగా, కారు తుని దాటిన తరువాత గల టోల్ గేటు దాటినట్లు, తరువాత ఏ మార్గంలోను టోల్ గేటులను దాటనట్లుగా గుర్తించారన్నారు. అనంతరం, అన్నవరంలోదూపం వినోద్ కుమార్ ఉండే అవకాశం ఉండవచ్చునన్న అనుమానంతో పోలీసు బృందం అన్నవరం వెళ్ళి, ముద్దాయి ఆచూకీ గురించి లాడ్జిల తనిఖీలు చేపట్టారు. అక్కడ ఒక లాడ్జిలో దూపం వినోద్ కుమార్ మకాం వేసినట్లుగా గుర్తించి, అతనినిఅదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి రూ. 3.90 లక్షల విలువైన స్విఫ్ట్ కారును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుమిస్టరీని ఛేదించుటలో ప్రతిభ కనబర్చిన విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావు, ఎస్ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ ఎస్ ఎ.త్రినాధరావు, కానిస్టేబుల్ షేక్ షఫీలను విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, విజయనగరం రూరల్ సిఐ టి.ఎస్.మంగవేణి అభినందించారుమీడియా సమావేశంలో విజయనగరం రూరల్ సిఐ టి.ఎస్.మంగవేణి, విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావులు పాల్గొన్నారు

*