చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎన్నిక ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఫలితాల్ని ప్రకటించవద్దన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని పాటిస్తే కఠిన చర్యలు తప్పవని, వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారుల్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసే వరకు మంత్రిని ఆయన నివాసానికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎస్‌ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియపైనా, శాంతిభద్రతలపైనా ప్రతికూల ప్రభావం చూపే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు మంత్రిని మీడియాకు కూడా దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డి గడప దాటకూడదు…నిమ్మగడ్డ ఆదేశాలు
Related tags :