వచ్చే నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అభ్యర్థి పేరుతో జరిగే ఈ ఎన్నికల్లో తనకు కలిసొచ్చే అనేక అంశాలున్నందున నేరుగా బరిలోకి దిగాలని రమణ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఆయన ఓటమిపాలయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పటి నుంచి కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో అప్పటి పొత్తుల్లో భాగంగా ఆయన సొంత నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్‌కే ఇచ్చారు. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కలిసొచ్చే అంశాలున్నాయని…ఎమ్మెల్సీగా బరిలోకి రమణ
Related tags :