* తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకోసారి మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానన్నారు. ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
* రైతు భరోసాయాత్రను పాదయాత్రగా కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మార్చుకున్నారు. అచ్చంపేట సభలో పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నేతలు మల్లు రవి, సీతక్క రేవంత్‌ను కోరారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా రేవంత్‌రెడ్డి బయలుదేరారు. అంతకుముందు అచ్చంపేటలో కాంగ్రెస్ రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఎవరి ఆశలు నెరవేరలేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆస్తులు మాత్రం పెరిగాయని ఆరోపించారు. కేంద్రం తెచ్చింది వ్యవసాయ చట్టాలు కాదని, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే చట్టాలని సీతక్క ధ్వజమెత్తారు.
* ఇదే సమయంలో గిరిజన యాత్రకు స్థానికులు కూడా భారీగా తరలివచ్చారు. అక్రమ కట్టడాలు నిర్మించారంటూ స్థానికులు గుర్రంపోడులోని షెడ్డులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలీసులపై పలువురు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు లాఠీ ఛార్జ్ చేశారు. పరిస్థితి మరిం క్లిష్టతరం కావడంతో బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని సూచించారు. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలు అయ్యాయి. ముఖ్యంగా రాళ్ళ దాడిలో కోదాడ టౌన్ ఎస్సై క్రాంతి కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ‘పోలీసులు మన వారే.. వారు లాఠీ చార్జీ చేసిన పడండి.. మీరు రాళ్లతో దాడి చేయొద్దు.. అని బండి సంజయ్ పదే పదే చెబుతున్న పలువురు రాళ్లతో దాడి చేయడం గమనార్హం.
* సీఎం కేసీఆర్ దోచుకున్నది కక్కిస్తాం.. జైలుకు పంపిస్తామని బీజేపీ నేత విజయశాంతి హెచ్చరించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దొర గిరిజనుల భూములు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉంటే తెలంగాణ ఎడారేనని విజయశాంతి ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల అంతు చూస్తామని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల భూములు తిరిగి ఇచ్చేయాలని, గిరిజనులపై లాఠీచార్జ్ చేయించిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతామని ఆయన మరోసారి హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు డ్రైవర్ అయ్యారని ఎద్దేవాచేశారు.
* టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల అంతు చూస్తామని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల భూములు తిరిగి ఇచ్చేయాలని, గిరిజనులపై లాఠీచార్జ్ చేయించిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతామని ఆయన మరోసారి హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు డ్రైవర్ అయ్యారని ఎద్దేవాచేశారు. క్యారెక్టర్ లేని పార్టీ టీఆర్ఎస్…కరెప్షన్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ అంటూ సంజయ్ ధ్వజమెత్తారు. మఠంపల్లి మండలం పెదవీడులో గ్లేడ్ ఆగ్రో కంపెనీ భూముల దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం షెడ్డును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
* ఉత్తరాఖండ్‌లోని చమోలీలో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగా నది ఉప్పొంగిన విషయం తెలిసిందే. ఈ వరద ఉద్ధృతి ప్రమాదంలో తపోవన్ పవర్ ప్రాజెక్టు వద్ద టన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ జవాన్లు సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో టన్నెల్‌లో ఉన్న కార్మికులు అలాగే బురదలో చిక్కుకుపోయారు. ఐటీబీపీ సిబ్బంది సాహసోపేతంగా టన్నెల్‌లోకి దిగి అందులో చిక్కుకున్న వ్యక్తుల్ని ప్రాణాలతో బయటకు తీశారు. ఓ వ్యక్తిని టన్నెల్‌లో నుంచి ప్రాణాలతో బయటకు తీసిన వెంటనే అతడు సంతోషంతో పులకరించిపోయిన దృశ్యం అక్కడి వారిని ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు వాడీ-వేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9న జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సర్పంచ్ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు ఓటు వేయాలని కోరుతూ వీధివీధికీ, ఇంటింటికీ తిరిగారు. పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
* తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సీఎం మార్పు ఊహగానాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని చురకలంటించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు సీఎం పదవి కట్టబెడతారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.
* పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా హల్దియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ నుంచి ‘మమత’ (ఆప్యాయత)ను ప్రజలు ఆశిస్తే ఆమె నుంచి నిర్మమత (క్రూరత్వం) లభించిందంటూ ప్రాసలు ఉపయోగిస్తూ విమర్శలు ఎక్కుపెట్టి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
* కరోనా వైరస్ వంటి వ్యాధులు, మహమ్మారులు విజృంభించినప్పుడు సమాజంలోని వివిధ వర్గాలవారు ఒత్తిడికి లోనవటం అనివార్యం. కాగా, వివిధ వృత్తుల్లో ఉన్నవారందరి కంటే.. మహిళా నర్సులు, వైద్యసేవల సిబ్బందిలో మానసిక సమస్యలు అధికమని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 43 వేల మంది గణాంకాలతో ఈ భారీ అధ్యయనాన్ని చేపట్టింది.
* బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలు పరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ మేరకు ముంబయిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ఇదివరకే ఆమె బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులను అప్పగించే వ్యక్తుల వివరాలు తెలియజేసేందుకు ఆమె నిరాకరించారు.
* తొలి టెస్టులో ఇంగ్లాండ్ పట్టుబిగిస్తోంది. వరుసగా మూడో రోజు ఆటలోనూ ఆధిపత్యం చెలాయించింది. అయితే రిషభ్ పంత్ (91; 88 బంతుల్లో, 9×4, 5×6), చెతేశ్వర్ పుజారా (73; 143 బంతుల్లో, 11×4) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ చెప్పుకోదగిన స్థితిలో నిలిచింది. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. సుందర్ (33*; 68 బంతుల్లో, 5×4), అశ్విన్ (8*, 54 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు. బెస్ (4/53), ఆర్చర్ (2/51) ఆతిథ్య జట్టును దెబ్బతీశారు. కాగా, ప్రత్యర్థి కంటే కోహ్లీసేన ఇంకా 321 పరుగుల వెనుకంజలో ఉంది.
* మయన్మార్, ఆ దేశ ఆర్థిక రాజధాని యాంగోన్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. తమ ప్రియతమ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని, మిలిటరీ ప్రభుత్వం గద్దె దిగాలన్న నినాదాలతో యాంగూన్ దద్దరిల్లుతోంది. ఇక మాండలేతో మయన్మార్‌లోని పలు ఇతర నగరాలు, ప్రదేశాల్లో కూడా నిరసనలు రాజుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. యాంగోన్‌లో ప్రముఖ సులె పగోడా కేంద్రంగా అహింసాయుత ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.