మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అనుమానమే లేదు. కానీ, మితంగా పుచ్చుకుంటే ఆల్కహాల్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయనే మాట తరచూ వినేదే. ఈ వాదనను బలపరిచే పరిశోధన ఒకటి వెలుగుచూసింది. ‘అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ’ అనే జర్నల్ నివేదిక ప్రకారం పరిమితంగా బీరు తాగేవారిలో కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గుముఖం పట్టాయట! గుండెకు మేలు చేసే యాంటి ఆక్సిడెంట్స్ ఎంతో కొంత పెరిగాయట కూడా. రక్తం గడ్డలు కట్టకుండా (బ్లడ్ క్లాట్స్) నివారించే ఫైబ్రినోజిన్ అనే ప్రొటీన్ కూడా వీరిలో ఎక్కువగా కనిపించడం విశేషం. ఇక రెడ్ వైన్ వల్ల ఇంతకంటే ఆరోగ్యం ఉంటుందని తేల్చిందీ పరిశోధన. ద్రాక్ష తొక్కులో ఉండే ‘రెస్‌వెరాట్రోల్’ అనే అరుదైన యాంటి ఆక్సిడెంట్, కొలెస్ట్రాల్‌తోపాటు రక్తపోటునూ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, మోతాదుకు మించి ఏ మాత్రం మద్యం పుచ్చుకున్నా సర్వ అవయవాలూ దెబ్బతింటాయని వారు హెచ్చరిస్తున్నారు.
బీరు తాగండి…కొవ్వు కరిగించుకోండి
Related tags :