Editorials

విశాఖ ఉక్కు ప్లాంట్ చరిత్ర ఇది

విశాఖ ఉక్కు ప్లాంట్ చరిత్ర ఇది

విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర.!

1966 నాటికి మనదేశంలో నాలుగే ఉక్కు కర్మాగారాలున్నాయి,5వ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పెట్టడానికి అన్నివిధాలా అనువైన ప్రదేశంగా పేర్కొంటూ 1963లోనూ 1965లోనూ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

ఈ నేపథ్యంలో విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని 1966 అక్టోబరు 15న గుంటూరు జిల్లా, తాడికొండకు చెందిన తెన్నేటి అమృతరావు అనే కాంగ్రెసు నాయకుడు నిరాహార దీక్ష ప్రారంభించారు

ఈ ఉద్యమం సందర్భంగా విజయవాడ (-5), విజయనగరం (2), కాకినాడ (1), పలాసా- (1), వరంగల్‌ – (1), రాజమండ్రి- (1), సీలేరు- (1), గుంటూరు- (5); ఇలా మొత్తం 32 మంది చనిపోయారు.

మూడేళ్ల తర్వాత 1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు

ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు,మరుసటి ఏడాది 1971 జనవరిలో ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు

ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.

నష్టాల్లో ఉన్న సంస్థను పునరుద్ధరించడానికి అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం రుణాలను ఈక్విటీ, ప్రిఫరెన్షియల్ షేర్స్ కిందకు మార్చి ఆడుకోవడం వల్ల సంస్థ మంచి పని తీరు కనపరిచి 2011-12 కు రుణవిముక్తి పొందింది.

విశాఖ ఉక్కు పరిశ్రమకు 2010 November లో నవరత్న హోదా దక్కింది.”కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజ ఘనులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటోంది.”

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు ఖనిజం కేటాయించి ఆదుకోవాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోంది.