ఓటు వేశారా ..? అంటే చేతి వేలికి ఉన్న సిరా గుర్తు చూపిస్తే చాలు ఓటు వేశారని అర్థంచేసుకుంటారు…. సిరా చుక్కకి.. ఓటుకున్న సంబంధం అంటే ఇదేమరి…. ఓటు హక్కు ఉన్నప్రతి పౌరుడు తప్పక వినియోగించుకుంటేనే మెరుగైన సమాజం స్థాపించబడుతుంది. దాన్నిదృష్టిలో ఉంచుకునే ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగాప్రచారం జరుగుతోంది… ఇక అసలు విషయానికి వద్దాం.. ఎన్నికల్లో వాడే ఈ నల్లని సిరాకర్ణాటకలోని మైసూర్లో తయారు చేస్తారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచేసిరా సరఫరా అవుతోంది. దీన్ని 29 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.ఇది 1962 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తోంది.మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ ఈ సిరాను ఉత్తత్తి చేస్తోంది. మైసూర్మహారాజు నాల్మడి కృష్ణరాజ వడయారు దీనిని స్థాపించారు. స్వాతంత్ర్యానికి ముందు వరకుమైసూర్ రాజుల ఆధీనంలో ఉన్న ఈ కంపెనీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరమైంది. ఓటరుపలుమార్లు ఓటు వేయకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చెరిగిపోని గుర్తు ఓటరు వేలిపైవేయాలని నిర్ణయించడంతో నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తినిబాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. మన రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల కోసం2లక్షల సీసాలు అవసరం అవుతాయని భావించి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారనిసమాచారం. ఒక్కో సీసాలోని సిరాను 500-700 మందికి గుర్తుగా వేయవచ్చు. సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రే ట్ ఉన్నందున వెం టనే చెరగిపో దు. ఈ సిరా నేరేడురంగులో ఉంటుంది.
ఎన్నికల సిరాలో ఎన్ని సిత్రాలో!
Related tags :