* మధ్యాహ్నం 3.30 గంటల వరకు వరుసలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్లు పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. తొలిదశ పోలింగ్‌లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని చెప్పారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచి ఎన్నిక చేపడతామన్నారు. ఒకవేళ ఉపసర్పంచి ఎన్నిక ఇవాళ పూర్తికాకపోతే బుధవారం నిర్వహిస్తామన్నారు..
* వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం .సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి .పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది .సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.దీనికి వక్ర భాష్యం చెప్పే రీతిలో చంద్రబాబు ప్రయత్నం చేశారు ..నిమ్మగడ్డ దానికి అనుకూలంగా వ్యవహరించారు.కానీ వారు చేప్పినట్లు ఏమీ జరగలేదు .ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన పరిధి దాటి ప్రవర్తించారు .ఇటువంటి సమయంలో రానున్న రోజుల్లో ఇల్లాంటి పరిస్థితి రాకుండా చర్చ జరగాలి .పలువురు ఎన్నికల కమిషనర్లు ఉండాల్సిన అవసరం ఉంది .
* పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుచ్చింపేట గ్రామంలో ఓ వింత చోటుచేసుకుంది.ఇక్కడ 7వ వార్డుకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.ఇందుకు కారణం ఏమిటంటే 25 సంవత్సరాలుగా ఈ వార్డు నుంచి గెలుపొందిన అభ్యర్థులు మరణిస్తున్నారట.దీంతో గ్రామస్థులు సెంటిమెంట్‌గా తీసుకుని ఈసారి ఆ వార్డుకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు.మండలంలో దీన్ని ఒక వింతగా అందరూ చర్చించుకుంటున్నారు.
* మాజీమంత్రి కొల్లు రవీంద్ర తనను బెదిరించారంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పొట్లపాలెం గ్రామంలో వైకాపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాగరాజు…తనను కొల్లు రవీంద్రతో పాటు మండల తెదేపా అధ్యక్షుడు కుంచేనాని నామినేషన్ వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం.మధ్యాహ్నం 3:30 గంటలవరకు జరగనున్న పోలింగ్.సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు.విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ పోలింగ్. 2,723 పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్.
* రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో టీడీపీ ఆందోళన. ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులు రాసిపంపుతున్నారని నిరసన. పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం.
* పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన కొద్దిసేపటికే ఓ వృద్ధురాలు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం ఎఫ్‌డీ పేట గ్రామంలో జరిగింది. 90 ఏళ్ల అప్పమ్మ అనే వృద్ధురాలు ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్న ఆమె.. కొద్దిసేపట్లోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
* తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపడుతున్నారు. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం ఉపసర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు.
* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో తెదేపా నాయకుడు రాంబాబుపై దుండగులు గొడ్డలితో దాడి చేశారు. తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ని జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య వేదాద్రి పంచాయతీ 7వ వార్డు అభ్యర్థిగా పోటీ చేశారు.
* పంచాయతీ ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కావలి డివిజన్‌లో 9 మండలాల్లోని 37 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లోని వలస కార్మికులు ఓటు వేయడానికి పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివచ్చారు. కొండాపూర్ మండలం పార్లపల్లి, మర్రిగుంటలో చెట్టు కింద పోలింగ్ కేంద్రాలు నిర్వహించారు.