ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా కరోనా మూలాలను కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు విఫలమైనట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ జీవాయుధం కాకపోవచ్చు అని కరోనా మూలాలపై అన్వేషణ జరిపిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఇది ఇతర జంతు జాతుల ద్వారా నేరుగా మానవులకు సోకినట్లుగా భావిస్తున్నామని పేర్కొంది. కొవిడ్ మూలాలపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం తాజాగా వెల్లడించింది. ‘కరోనా వైరస్ తొలుత జంతువుల నుంచే మానవులకు సోకిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వాటి మూలాలను గుర్తించాల్సి ఉంది’ అని చైనాలో దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన లయాంగ్ వానియన్ పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్ తొలి కేసు బయటపడగా, అంతకు ముందు వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనడానికి సరైన ఆధారాలు లభించలేదని వెల్లడించారు. వుహాన్ నగరంలో గుర్తించక ముందే ఇతర చోట్ల వైరస్ వ్యాపించి ఉండే అవకాశాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య కమిషన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సమర్థించిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు బెన్ ఎంబారక్, తొలికేసు నమోదుకాక ముందు వుహాన్‌లో పెద్దగా వైరస్ వ్యాప్తి చెందిందనడానికి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
కరోనా జీవాయుధమా?
Related tags :