Politics

తొక్కి పడేస్తా…కేసీఆర్ ఆగ్రహం-తాజావార్తలు

తొక్కి పడేస్తా…కేసీఆర్ ఆగ్రహం-తాజావార్తలు

* హాలియా సభలో కేసీఆర్ ఫైర్సభలో కేసీఆర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయి …వారిని తరిమేయండి .. పోలీసులు అరెస్ట్ చేయండి (సభలో కేసీఆర్ స్పీచ్ ను అడ్డుకునే వారిని ఉద్దేశించి)..పిచ్చిపనులు చేస్తే తొక్కి పడేస్తాం.సహనానికి కూడా హద్దు ఉంటుంది.కొత్త బిచ్చగాళ్ల లా కొద్దిమంది ప్రవర్తిస్తున్నారు.మేము తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయిపోతారు.ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదు.మీలాంటి వాళ్ళను చాలామందిని చూసాం.రైతుబాట కార్యక్రమం ఎందుకు…రైతులు బాగున్నందుకా…మీ హయాంలో రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి.పెద్ద పెద్ద డైలాగులు కాంగ్రెస్ నాయకులు చెబుతారు.. కానీ అభివృద్ధి ఏమీ చేయలేదు.పిచ్చివాగుడు మానుకోవాలి అని బీజేపీ నాయకులకు చెబుతున్న.

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కోరినట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్‌ ప్లాంట్‌పై తుది నిర్ణయం కేంద్రానిదేనన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీ ప్రజల మనోభావాలకు ప్రతీకగా భావించాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు. స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చని చెప్పారు. కేంద్రమంత్రి చెప్పినట్టుగా పోస్కో, స్టీల్ ప్లాంట్ మధ్య ఒప్పందం జరిగినప్పుడు.. జగన్‌ లేఖ రాయడంలో ఆంతర్యమేంటని పవన్‌ ప్రశ్నించారు.

* గ్రామ పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది.ఎన్నికల ఫలితాలపై స్పందించిన బాబు.ఎన్నికల్లో నిజమైన హీరోలు ప్రజలేనని, ఎన్ని విధాలుగా హింసించినా ఎదురొడ్డి పోరాడారని కొనియాడిన బాబు.టీడీపీ ప్రజల గుండెల్లో ఉంది.వైసీపీ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు.టీడీపీకి 38.74 శాతం పోలింగ్‌ నమోదైంది.అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలి.

* ఐదేళ్లపాటు ఉండాల్సిన కార్పొరేటర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజున పెడతారా.. అంటూ రాజకీయపార్టీల ప్రతినిధులు అధికారుల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్నికల కమిషనర్‌ నిర్ణయమని, రాజ్యాంగ విధి అయినందున చేయగలిగిందేమీ లేదని ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌ వివరించారు. కనీసం.. రాహుకాలం ముగిసేంత వరకైనా సమయమివ్వాలని, ఉదయం 11.30 గంటల వరకు రాహుకాలం ఉంటుందని చెప్పడంతో, ఎన్నిక నిర్వహించేది ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అని తెలిపారు. అందరూ వచ్చి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేంతవరకు దాదాపుగా అంతే సమయమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న జరగనున్న ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియ విధానాన్ని వివరించేందుకు జీహెచ్‌ఎంసీలో మంగళవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయపార్టీల నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి (టీఆర్‌ఎస్‌ ), ఎమ్మెల్సీ సయ్యద్‌ అమినుల్‌ జాఫ్రి (ఎంఐఎం), నిరంజన్‌ (కాంగ్రెస్‌ ), బీజేపీ నుంచి శంకర్‌ యాదవ్, దేవర కరుణాకర్‌లు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, తదితరమైన వాటి గురించి లోకేశ్‌కుమార్‌ వారికి వివరించారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యులు 11వ తేదీన 10.45 గంటల వరకు గుర్తింపు కార్డు, సమావేశ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసును తీసుకొని కౌన్సిల్‌ హాల్‌కు రావాలి. సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు, ఉర్దూ, హిందీ ఇంగ్లీష్‌ నాలుగు భాషల్లో ఉంటుంది. ఎవరికిష్టమైన భాషలో వారు చేయవచ్చు.

* నాగార్జున సాగర్‌ నియోజకర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ర‌వీంద్ర నాయ‌క్‌తో పాలు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు.

* బంజారాహిల్స్‌లోని టీవీ 9 కార్యాల‌యంలో త‌న కాబిన్‌లో నుంచి పాస్‌పోర్టును దొంగిలించి రామేశ్వ‌రావు త‌న ఇంట్లో దాచుకున్నాడ‌ని వేసిన కేసులో హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ” ర‌వి ప్ర‌కాశ్ అనే ఒక వ్య‌క్తిపై ఎన్ని కేసులు పెడ‌తారు? ఎంతకాలం వేధిస్తారు? వేధించ‌డం ఆప‌రా?” అని ప్ర‌శ్నించింది. “పాస్‌పోర్ట్ దొంగ‌త‌నం లాంటి చ‌ర్య‌లు నీతిబాహ్య‌మైన చ‌ర్య‌లని” హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఒక కంపెనీని క‌బ్జా చేయ‌డానికి ఇంత నీచ‌మైన ప‌నులు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించింది.

* మిషన్ బిల్డ్ ఏపీ అంశంపై సుప్రీం కోర్టులో.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. మిషన్ బిల్డ్ ఏపీ అంశంలో రిక్యుజల్ పిటిషన్​పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్​పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేయటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాలు చేస్తూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది… హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషదాయకమని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా, ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందని ఎస్ఈసీ భావిస్తోందన్నారు. ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో, నిబంధనలతో పనిచేయడం సంతోషాదాయకమన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారని, పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నానని అన్నారు. తొలిదశ ఎన్నికలలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు పూర్తి సమన్వయంతో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. రెండవ దశ ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలని నిమ్మగడ్డ పిలుపు ఇచ్చారు.