NRI-NRT

ట్రంప్‌తో 90సెకన్ల శృంగారం…

ట్రంప్‌తో 90సెకన్ల శృంగారం అత్యంత చెత్త సమయం

గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు అఫైర్‌ ఉందని ప్రకటించి సంచలనం సృష్టించిన అడల్ట్‌ స్టార్‌ స్టోమీ డేనియల్స్‌ మరో సారి వార్తల్లో నిలిచారు. ట్రంప్‌తో గడిపిన ఆ 90 సెకన్లు తన జీవితంలో అత్యంత చెత్త సమయం అన్నారు. అలాంటి వ్యక్తిని కలిసినందుకు తన మీద తనకే అసహ్యం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘2006లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో నాకు అఫైర్‌ ఉండేది. అయితే నేను అతడితో శృంగారాన్ని కోరుకోలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఓ సారి ఆ సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడేప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వద్దామా అని ఎదురు చూశాను. ఆ 90 సెకన్ల కాలం నా జీవితంలో అత్యంత చెత్త సమయం. అతడిని కలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది’’ అన్నారు. పోడోకాస్ట్‌ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్‌తో మాట్లాడుతూ డేనియల్స్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ట్రంప్‌ వీటిని కొట్టి పారేశారు.