అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు.
సెనేట్‌లో ట్రంప్ అభిశంసనకు ఆమోదం
Related tags :