టాటా స్టీల్‌కు చెందిన నోవాముండి ఇనుప గనుల్లో, భారీ యంత్రాల (హెవీ ఎర్త్‌మూవింగ్ మెషినరీ) నిర్వహణ కోసం తొలి సారిగా 22 మంది మహిళా ఆపరేటర్లను నియమించారు. వీరు అన్ని షిఫ్టులలోనూ పనిచేస్తారని కంపెనీ మానవ వనరుల మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆత్రేయ సర్కార్ పేర్కొన్నారు. ‘తేజస్విని 2.0’ పథకం కింద నైపుణ్యం లేని మహిళా సిబ్బందికి శిక్షణ ఇచ్చి గనుల్లో ప్రధాన ఉద్యోగాల్లో పనిచేసేలా చేస్తున్నామని అన్నారు. మొత్తం 350 దరఖాస్తులు రాగా.. పరీక్ష, ముఖాముఖి అనంతరం 22 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భమ్ జిల్లా నోవాముండి నుంచే ఎక్కువ మంది మహిళలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
టాటా గనుల్లో 22మంది మహిళలకు ఉద్యోగాలు
Related tags :