అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్‌వర్త్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్‌ఎక్స్‌కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్‌ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఫోర్ట్‌వర్త్ వద్ద I35పై ప్రమాదం చిత్రాలు
Related tags :