Kids

పది నిముషాల శక్తి ఇది

పది నిముషాల శక్తి ఇది

పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే జీవితం చాలా కష్టం అనిపిస్తుంది

పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సరళం అనిపిస్తుంది

పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే
ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది

పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది

పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే
చస్తేనే మంచిది అనిపిస్తుంది

పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.

పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది.

పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది.

పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.

పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.

పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది.

పది నిమిషాలు మంచి స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది.