Politics

గవర్నర్‌కు విమానం నిరాకరించిన మహారాష్ట్ర ప్రభుత్వం-ఉదయపు తాజావార్తలు

Morning News - Maharashtra Governor Denied Govt Helicopter

? హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ కొత్త పాలకవర్గం కొలువుతీరింది. మేయర్‌గా బంజారాహిల్స్ తెరాస కార్పొరేటర్ , సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఉప మేయర్​గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. మరోసారి అధికార పార్టీకి మజ్లిస్‌ పార్టీ అండగా నిలిచింది. సరైన బలం లేకపోవడంతో మేయర్‌, ఉపమేయర్‌ కోసం భాజపా పోటీపడినా ఓటమి చవిచూసింది.

? మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఉత్తరాఖండ్​, ముస్సోరీలోని లాల్​ బహదూర్​ శాస్త్రీ అకాడమీలో జరగనున్న అధికారిక వేడుకకు గవర్నర్​ హాజరు కావాల్సి ఉంది.

? ఘట్​కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ అత్యాచారం కేసులో నలుగురు అరెస్ట్. నిందితులు నలుగురు ఆటోడ్రైవర్లుగా గుర్తించిన పోలీసులు. రాంపల్లి, మయాన్‌పేట్‌కు చెందిన వారిగా గుర్తింపు. ఓ ఆటోడ్రైవర్‌పై గతంలో రెండు కేసులు

? ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా: హైకోర్టు
గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో ఫుట్​పాత్​ల ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది తిరుమలరావు పిల్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… వెంటనే ఆక్రమణలు తొలగించాలని జీహెచ్​ఎంసీ, పోలీసులకు ఆదేశించింది. సర్వేచేసి ఫుట్​పాత్​లు లేని ప్రాంతాలను గుర్తించాలని… లేనిచోట నిర్మాణాలు చేపట్టాలని సూచించింది.

? ముస్లిం పర్సనల్​ లా ప్రకారం యుక్త వయస్సుకొచ్చి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులు వారికి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కుందని పంజాబ్​ అండ్​ హరియాణా​ హైకోర్టు స్పష్టం చేసింది. 17 సంవత్సరాల వయస్సుగల ఓ ముస్లిం యువతి, మరో ముస్లిం యువకుడిని పెళ్లాడిన కేసులో ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

? అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ముంబయికి చెందిన 5 నెలల చిన్నారి చికిత్సకు ప్రధాని నరేంద్ర మోదీ చేయూతను అందించనున్నారు. ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై రూ.6కోట్ల దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.

?సింగపూర్ సిటీ: నకిలీ పెట్టుబడి పథకాల ద్వారా భారీ మొత్తంలో మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి సింగపూర్‌లో 6 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే.. సతీష్ నాయర్ ధనబలన్(36) అనే భారత వ్యక్తి తోటి ఇండియన్‌తో పాటు పలువురు సింగపూర్ వాసులను తక్కువ పెట్టుబడిపై అధిక మొత్తం వస్తుందని ఆశచూపి భారీగా ఇన్వెస్ట్ చేయించాడు. ఇలా నకిలీ పెట్టుబడి పథకాల ద్వారా 2014 నుంచి 2016 వరకు తొమ్మిది మందిని ఏకంగా ఒక మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 5.49కోట్లు) మోసగించాడు. ఇందులో తోటి భారతీయుడు ఎలంగోవన్ పిళ్ళై మునిసామీ అనే వ్యక్తికి 2 లక్షల సింగపూర్ డాలర్లు(రూ.1,09,86,614) కుచ్చుటోపీ పెట్టాడు సతీష్.

?భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న నకిలీ మావోయిస్టుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లాలోని ఏడూర్ల  బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల పేరుతో ఇసుక ర్యాంపులు నిర్వాహకులు, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు.., ఒక నాటు తుపాకి, మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఏడూర్ల బయ్యారం సీఐ రమేష్ తెలిపారు. వీరంతా పోలీస్ స్టేషన్ పరిధిలోని జానంపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు.

?హైదరాబాద్‌: ‘మిస్‌ ఇండియా 2020’ టైటిల్‌ను తెలంగాణ అమ్మాయి సొంతం చేసుకుంది. 23 ఏళ్ల యువ ఇంజనీర్‌ మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మానస  గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం  ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. 2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది.

? TS: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌
హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.