అందం, అభినయం ఉంటే సరిపోదని.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టమూ కీలకపాత్ర పోషిస్తుందని అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. తెలుగులో మూడు చిత్రాలు చేసినా ఆమెకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. హైదరాబాద్‌లో పుట్టి.. బెంగళూరులో పెరిగిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. దీంతో ఆమె కోలీవుడ్ బాటపట్టింది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీల గురించి మాట్లాడుతూ.. ఎక్కడ సినిమా ఎక్కువ డబ్బు తెచ్చిపెడుతుందో.. అక్కడ వాళ్లు తీసుకున్న కంటెంట్ మంచిదని చాలా మంది నమ్ముతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
లేని అదృష్టంపై నిధి దిగులు
Related tags :