Movies

ఛీటింగ్ కేసులో సన్నీకి బెయిల్

ఛీటింగ్ కేసులో సన్నీకి బెయిల్

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చీటింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి సన్నీలియోనీకి ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 2019లో ప్రేమికుల దినోత్సవం రోజున తాము ఏర్పాటు చేసిన రెండు ఈవెంట్లలో సన్నీలియోనీ పాల్గొంటానని చెప్పి అప్పట్లో తమ వద్ద నుంచి రూ.29 లక్షలు తీసుకుందని, కానీ ఆమె మాత్రం పాల్గొనలేదని పేర్కొంటూ ఇటీవల ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెను విచారించారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్‌ కోరుతూ సన్నీలియోనీ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.