కృష్ణా జిల్లా వెల్వడం గ్రామంలో డా.లకిరెడ్డి హనిమిరెడ్డి కోట్లాది రూపాయిల ఖర్చుతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రవాసాంధ్రులతో పాటు రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తాను జన్మించిన వెల్వడం గ్రామంలో రహదారులు, పాఠశాలలు, దేవాలయాలు, డ్రైనేజీల నిర్మాణానికి డా.లకిరెడ్డి ఇప్పటికే దాదాపు ₹4కోట్లను ఖర్చు చేశారు. గ్రామం నడిబొడ్డున మరొక ₹2కోట్ల వ్యయంతో ఆయన నిర్మించిన రెవెన్యూ భవనం చూపరులను ఆకట్టుకుంటోంది. అమెరికా సెనేట్ తరహాలో నిర్మించిన ఈ భవనం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలకు, మిగిలిన ప్రభుత్వ భవనాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. నిర్మాణం పూర్తి అయిన ఈ భవనానికి త్వరలో డా.లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. తాను పుట్టిన వెల్వడం గ్రామాన్ని, కోట్లాది రూపాయిల ఖర్చుతో అభివృద్ధి చేస్తున్న డా.హనిమిరెడ్డిని ఆ గ్రామ ప్రజలు అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఏపీకే తలమానికం…డా.లకిరెడ్డి ఔదార్యం-TNI ప్రత్యేకం
Related tags :