శుభోదయం ??
? అందరూ బాగుండాలి?
? అందులో మనముండాలి ?
సర్వేజనాః సుఖినోభవన్తు.
లోకాసమస్తా సుఖినోభవంతు.
☘️?????☘️
? ప్రకృతిని ప్రేమిద్దాం ?
? పచ్చదనం కాపాడుకుందాం ?
???
మనల్ని ప్రేమించే వారు చూపులకు దూరం కావొచ్చేమో కానీ…
మనసుకి దగ్గర అవుతూనే ఉంటారు.
???????????
???
ఎవ్వరు ఎంత హేళన చేసినా
నీవు తొందర పడకు….
హేళన చేసిన వారితోనే…
సలాం కొట్టించే సత్తా…
ఒక్క కాలానికే ఉంది…
ఓర్పుతో ఉండు…..నీ ఓర్పు
నేర్పు ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది…!!
???? ????
???
నువ్వు ఓడిపోతావని అందరూ
అనుకుంటున్నప్పుడు లేచి నిలబడు
వాళ్ళ కళ్ళల్లో భయం కనపడుతుంది
నువ్వు గెలవక ముందే అది నీకు
తొలి విజయం అవుతుంది….!!
???? ????
☘️?☘️
మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది…
మోసం అందరూ చేస్తారు.
నమ్మక ద్రోహం నువ్వు
నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు…!!
☘️?☘️??☘️?☘️
???
తప్పు చేసి కూడా
తమదే గెలుపని వాదించేవారికి
ఎదురు చెప్పకండి….
నిజానికి ఆ వాదనలో
న్యాయం లేదని వాళ్ళకీ తెలుసు
అహం అడ్డుగా ఉండటం వల్ల
ఒప్పుకోలేరు….!!
???? ????
☘️?☘️
మనం జీవితంలో ఎదగాలని
అనుకోవటంలో తప్పు లేదు.
కానీ… ఎదిగే వాడిని చూసి..
అసూయ పడటం చాలా తప్పు.
నీలో సత్తా ఉంటే నువ్వు కూడా
ఎదగడానికి ప్రయత్నించు….
గెలిచి చూపించు…..!!
☘️?☘️? ?☘️?☘️
???
కొన్ని అవమానాల తరువాత
విజయాలు వరిస్తాయి అన్న మాట
నిజమే…….కానీ…..
ముళ్ళకంచె మీద వేసిన వస్త్రం
తిరిగి రాదు…….
ఒకవేళ తిరిగి వచ్చినా…..
అది యథాస్థానానికి మాత్రం రాదు….
అవమానం కూడా అంతే……!!
???? ????
?నేటి సుభాషితం?
క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది.
?నేటి ఆణిముత్యం?
చవకబారు పనులు చరితహీనుని జేయు
చేరదీయడెవడు చెంతకెపుడు
అన్ని నేనె యనుట మిన్న కాదెన్నడు
తక్కువెవరుకాదు తరచి చూడ!
భావం:
నీ స్థాయని తక్కువ చేసుకునే పనులు చేస్తే చరిత్ర హీనునిగా మిగిలి పోతావ్.నీకెవరు మద్దతు ఇవ్వరు,సరికదా నీ దరిదాపులకు కూడా ఎవరూ రారు. అన్నీ నేనే,అన్నీ నావల్లే, జరుగుతున్నయి అనుకోవడం మంచిది కాదు. పరిశీలించి చూస్తే ఎవరూ ఎవరికి తక్కువ కాదు.ఎవరిస్తాయి వారికుంటుంది.
?నేటి జాతీయం?
గుండెల్లో రాయి పడింది
భయమేసింది
ఉదా: వాడు చేసిన పని వింటుంటే నా గుండెల్లో రాయి పడింది.
? నేటి సామెత ?
పోరు నష్టం -పొందులాభం
విరోధము నష్టాన్ని, స్నేహం లాబాన్ని కలిగిస్తుందని దీనర్థం
???????????