* కొడాలి నానిపై కేసు.మంత్రి కొడాలి నానిపై కేసుల నమోదుకు ఎస్ఈసీ ఆదేశం.కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించిన ఎస్ఈసీ రమేశ్ కుమార్.ఐసీపీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదుకు ఆదేశం.ఎస్ఈసీని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఆదేశం.
* తమ దాంపత్య జీవితానికి అడ్డువస్తోందని విసుగు చెందిన ఓ మహిళ (మొదటి భార్య) తన భర్త రెండో భార్యను చున్నీతో ఉరివేసి హతమార్చింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం పోచమ్మబస్తీకి చెందిన కర్నె భాస్కర్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. భాస్కర్‌కు జానకితో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం స్రవంతి అనే మరో మహిళను భాస్కర్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి.
* దేశ రాజధాని నగరంలో ఓ ఎస్సై ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సీఏటీఎస్ (సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రౌమా సర్వీసెస్) అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తుండగా ఉరి వేసుకున్నట్టు సమాచారం. ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ్వీర్ సింగ్ (39)ను మూడు ఆస్పత్రుల్లో చేర్పించుకొనేందుకు నిరాకరించడంతో చివరకు అదే అంబులెన్స్‌లో ఐహెచ్‌బీఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్వీర్ శుక్రవారం అంబులెన్స్‌ను ద్వారకాలోని తన నివాసం వద్దకు పిలిచారు. అయితే, ఆయన్ను చేర్పించుకొనేందుకు మూడు ఆస్పత్రులు నిరాకరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో సీఏటీఎస్ సిబ్బంది ఆయన్ను శాంతింపజేసి ఐహెచ్‌బీఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
* ఘట్కేసర్ సమీపంలో ఫార్మసీ విద్యార్థినిపై కిడ్నాప్, అఘాయిత్యం జరిగినట్లుగా నమోదైన కేసును తప్పుడు కేసుగా పోలీసులు నిర్థరించారు. యువతిపై అత్యాచారం జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు.
* పాత వివాదాల కారణంగా కొంపంగికి చెందిన విద్యార్థిని బడేవలసకు చెందిన మరో విద్యార్థి శుక్రవారం కత్తితో గాయపరిచాడు. పోలీసుల వివరాల మేరకు ప్రేమ వ్యవహారంలో నాలుగురోజులుగా కర్రి చేతన్, సింహాద్రి మురళి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. డిగ్రీ చదువుతున్న చేతన్ కళాశాల నుంచి గజపతినగరం నుంచి ఇప్పలవలసకు బస్సులో ఇంటికి బయలుదేరాడు. మురళి కొత్తరోడ్డు వద్ద ఎక్కి కత్తితో పొడిచి పారిపోయాడు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై మహారాష్ట్రలో దోపిడీ దొంగలు దాడికి పాల్పడి దొరికిన సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీలో చోటుచేసుకుంది. బాధితులు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే దోపిడీ దొంగల దాడిలో గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.